• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ‘సింహం’ కోసమే ఎన్టీఆర్ ఇలా…

  ntr-and-hari

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇప్పడు వున్నాఫాలోయింగ్ బహుశా తన సినీ కెరీర్ లో ఇంతకూ ముందెప్పుడూ లేదనే చెప్పాలి, ఆయన చూస్తే ఒక న్యూస్, నవ్వితే ఒక న్యూస్, గడ్డం పెంచినా న్యూస్ రావటమే, మీసం తిప్పిన న్యూస్ రావటమే,,ఇలాంటి న్యూస్ క్షణాలు వ్యవధిలో సోషల్ మీడియాలో చాలా స్పీడ్ గా ట్రెండ్ అవుతుంది, అందుకు తగ్గట్లే పబ్లిక్ రెస్పాన్స్ కూడా రావటంతో అనేక న్యూస్ వెబ్ సైట్స్ రోజు ఒకటైన ఎన్టీఆర్ గురించి తమ సైట్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాయి…

  ఇక విషయానికి వస్తే తాజాగా ఎన్టీఆర్ తలసాని వారి రిసెప్షన్ లో సరికొత్త లుక్ తో దర్శనం ఇవ్వటం తెలిసిందే, అయితే ఎన్టీఆర్ ఇలా భారీగా మీసాలు పెంచటం వెనుక కారణం లేకపోలేదని తెలుస్తుంది, అదేమిటంటే తమిళ దర్శకుడు హరితో ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడని ఆ సినిమాకి ‘సింహం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది, గతంలో హరి ఒక పవర్ ఫుల్ కథని సిద్ధం చేసుకొని ఎన్టీఆర్ కి వినిపించిన విషయం తెలిసిందే, ఇప్పడు అదే కథని ఫైనల్ చేశారని టాక్ నడుస్తుంది.

  ntr-new-look

  తమిళ మరియు తెలుగులో ఘన విజయాలు సాధించి మరో సారి సింగం-3 సినిమాతో ముందుకు వస్తున్నా ‘సింగం సిరీస్’ దర్శకుడే ఈ ‘హరి’, పోలీస్ పాత్రలకు తనదైన మాస్ మసాలా యాక్షన్ జతచేసి తెర మీద హీరోని ఒక సింహం మాదిరి చూపించే ఈ దర్శకుడు సూర్యతో ఇప్పటికే ‘ఆరు,దేవా,సింగం,సింగం-2’  లాంటి సినిమాలను తీసి విజయం అందుకున్నాడు, ఈ సినిమాలు అన్ని కూడా ఫుల్ మాస్ కథలతోనే తెరకెక్కినవి, ఇప్పడు మరో సారి ఎన్టీఆర్ తో ఇలాంటి మాస్ మూవీ తీయటానికి రెడీ అయ్యాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

  అయితే ఎన్టీఆర్ తదుపరి సినిమా గురించి అనేక వార్తలు వస్తున్నాయి…!  పోతున్నాయి…!  రీసెంట్ గా అనిల్ రావిపూడితో దాదాపుగా సినిమా ఫైనల్ అయ్యిందని అందులో ఎన్టీఆర్ అంధుడిగా నటిస్తున్నాడని న్యూస్ బాగా హల్ చల్ చేసింది,అయితే అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. అలాగే ఇప్పడు ఈ న్యూస్ కూడా అటు ఇటు తిరిగి కనుమరుగు అవుతుందో లేక తెరకెక్కి కనువిందు చేస్తుందో చూడాలి….

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *