• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఆంధ్రప్రదేశ్ కి తొలి ప్రైవేట్ యూనివర్సిటీ..

  vit-university-foundation-stone-laying-ceremony-hold-in-inavolu

  ఆంధ్రప్రదేశ్ రాజధానిలో విట్ యూనివర్సిటీకి శంకుస్థాపన జరిగింది. ఐనవోలు గ్రామంలో తొలి ప్రైవేట్ యూనివర్సిటీ విట్ కి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేసారు. తొలి దశలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ యూనివర్సిటీని నిర్మిస్తున్నారు. వచ్చే విద్య సంవత్సరం నుండి ఈ క్యాంపస్ లో క్లాస్ లు ప్రారంభం కానున్నాయి.

  విట్ యూనివర్సిటీ ఏపీకి రావడం సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నాలెడ్జి సెంటర్లో దేశంలోనే నెంబర్ 1 గా ఉంటాం అని తెలియజేసారు.ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. ఐటీ రంగాన్ని మొదట మనమే ప్రవేశపెట్టామని చెప్పారు. ఇప్పుడు దేశంలో 100 మంది ఐటీ నిపుణులు లో 25% మంది మన తెలుగు వాళ్ళు ఉండడం గర్వకారణం అని తెలిపారు.

  ఈ యూనివర్సిటీ కి మొత్తం 200 ఎకరాలు కేటాయించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మొదటి దశలో 100 ఎకరాల్లో భవనాలను నిర్మించనున్నారు. ఐనవోలు లో 2000 కోట్లతో ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నారు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *