• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  నాగ్ గాడు ఒక్క చైను లాగితే చాలు:వెంకీ

  Venkatesh shiva to vangaveeti

  దాదాపు 25  సంవత్సరాల క్రితం వచ్చిన శివ సినిమా గురించి తెలియని వాళ్ళు వుండరు. ముఖ్యంగా అందులో సైకిల్ చైను గురించి మాట్లాడుకొని సినీ జనాలు, సామాన్య ప్రజలు లేరంటే నమ్మండి. అంతలా ఇంపాక్ట్ చూపించిన సైకిల్ చైను ఫైట్, ఆ తరవాత సినిమా ఫైట్స్ యొక్క స్వరూపాన్నే మార్చివేసింది.

  ఈ సినిమా విడుదల అయ్యినపుడు ప్రేక్షకులు ఏ విధంగా మాట్లాడుకున్నారో అంతకంటే ఎక్కువగానే  నాగార్జున తోటి నటులు కూడా మాట్లాడుకున్నారు. తాజాగా జరిగిన “శివ టు వంగవీటి” ఫంక్షన్ లో ఆనాటి సంఘటనలను విక్టరీ వెంకటేష్ అందరితో పంచుకున్నాడు.శివ సినిమా తరవాత హీరోలందరూ అనుకున్నాము,”శివ సినిమా రాకముందు ఫైట్  చేసేటప్పుడు పెద్ద పెద్దగా అరుస్తూ ఎగిరి,ఎగిరి ఫైట్స్ చేసేవాళ్ళం, కానీ శివ సినిమాలో నాగ్ గాడు నిలబడి సైకిల్ చైను లాగి మొత్తం కొట్టేశాడని” మేము అప్పుడు అనుకున్నాము.

  శివ తర్వాత వర్మ నాతో శివ లాంటి సినిమా చేస్తాడేమో, అంతకంటే గొప్ప సినిమా చేస్తాడేమో అనుకున్న, నాగ్ తో చైను లాగిస్తే నాతో కూర్చోబెట్టి పాట చేయించాడు. క్షణక్షణం సినిమా అప్పుడు రాము అడిగేవాడు, నీతో కాకుండా ఎక్కువగా శ్రీదేవితో షూట్ చేస్తున్న నువ్వు ఏమైనా ఫీల్ అవుతున్నావని, అదేమీ లేదు నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాని చెప్పాను. నాకు తెలుసు వర్మ గురించి అందుకే అలా చెప్పాను, నిజంగానే ఎంజాయ్ చేశాను వర్మ అంటూ చెప్పుకొచ్చాడు.

   

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *