• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  “గురు’ టీజర్ వచ్చేసింది…!!

   

  venki

  సీనియర్ స్టార్ హీరోల్లో తనకంటూ ప్రతేక్యమైన ముద్ర వేసుకున్నాడు విక్టరీ వెంకటేష్.ఫ్యామిలీ ఆడియన్స్ ని మీరు ఎవరి ఫ్యాన్ అని అడిగితే తడుముకోకుండా వెంకటేష్ అని చెప్పేసేవాళ్ళు. ఈరోజు తన 56వ పుట్టిన రోజు జరుపుకుంటున్న వెంకీ తన కొత్త సినిమాలో తన న్యూ లుక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నాడు.

  జన్మదిన సందర్భంగా ఒక ఛానల్ లో ఇంటర్వ్యూ కి వెళ్లిన వెంకీ తన బాడీ ఫిట్నెస్ గురించి మనతో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ని పంచుకున్నాడు.ఈ సినిమా కోసం కొంచెం కష్టపడ్డానని తన సహోదరుడి కొడుకు రానాకి ఫిట్నెస్ ట్రైనర్ గా పని చేసే కనుల్ గిర్ సహాయం తో కొన్ని నెలలు జిమ్ లో ట్రైన్ అయ్యానని బాడీ ఫిట్ గా ఉండటం కోసం చాలా డైటింగ్ చేసానని చెప్పుకొచ్చాడు వెంకీ.ఈ చిత్రంలో తన లుక్ చూసి తానే ఆశ్చర్యపోయాడని కూడా చెప్పాడు వెంకీ.హీరోయిన్ గా రితిక సింగ్ నడిచిందని తను కూడా చాల బాగా చేసిందని చెప్పాడు వెంకటేష్. ఈ “గురు” సినిమాలో వెంకీ ఒక బాక్సింగ్ కోచ్ లాగా కనిపించనున్నాడు.

  వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు గురు సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేసారు.”జింగిడి జింగిడి” అని వచ్చే ఒక చిన్న పాట బిట్ ని రిలీజ్ చెయ్యగా అందులో వెంకటేష్ చాలా కొత్తగా కనిపించాడు.సుధ కొంగర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా,వై నాట్ స్టూడియోస్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించింది.”గురు” సినిమాని వచ్చే ఏడాది జనవరి 26వ తారీఖున మన ముందుకి తీసుకురానున్నారు.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *