• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఖైదీ టీం మీద సంచలన ట్వీట్స్ చేసిన వర్మ…!!

  varma

  ఎప్పుడు తన ట్విట్టర్ అకౌంట్ లో ఆక్టివ్ గా ఉండి తన ట్వీట్స్ తో అందరికి షాకులు ఇస్తూ ఉంటాడు మన రామ్ గోపాల్ వర్మ.రీసెంట్ గా మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న తన 150 వ చిత్రం “ఖైదీ నెం150” సినిమాలోని ఒక పోస్టర్ రిలీజ్ చెయ్యగా దాని మీద తెగ కామెంట్స్ చేసేసాడు వర్మ.

  కొత్త పోస్టర్ లో చిరు ఒక బాక్స్ మీద కూర్చొని కత్తి ని పట్టుకొని ఉండగా అసలు మెగా స్టార్ ని ఈ స్టిల్ లో కూర్చోమని సలహా ఇచ్చిన డిజైనర్లు,డైరెక్టర్ల కి దండం పెట్టాలి…అంతే కాకుండా ఈ పోజ్ ఇచ్చేందుకు మెగా స్టార్ ని కన్విన్స్ చేసిన టీం మెంబర్ల యొక్క నంబర్లు,పేర్లు ఇవ్వండి వీళ్ళ గురించి ఏకంగా సిని చరిత్రలోనే ఒక బుక్ ఉండాలి అని ట్వీట్స్ చేసి ఒక్కసారి గా దుమారం లేపేసాడు రామ్ గోపాల్ వర్మ.తెలుగు పరిశ్రమలోనే బాస్ గా చెప్పుకునే చిరంజీవి ఇలాంటి సిల్లీ పోజులు ఇస్తుంటే వర్మ కి నచ్చినట్టు లేదు అందుకే ఖైదీ టీం అందరికి కలిపి ఒకేసారి డోస్ ఇచ్చేసాడు.

  ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించిన పాటలు.టీజర్,పోస్టర్స్ తో సినిమా మీద అటు అభిమానులకి ఇటు సామాన్య ప్రేక్షకులకి అంచనాలు ఆకాశానికి అంటేశాయి అనే చెప్పాలి.దీనికి తోడు ఈ 7వ తారీఖున జరగనున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో మరింత బజ్ తెచ్చేయనున్నారు ఖైదీ టీం వాళ్ళు.11వ తారీఖున ఈ సినిమా మన ముందుకి రానుంది.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *