• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మూవీ రివ్యూ&రేటింగ్ : వంగవీటి

   

  Vangaveeti movie review

  మూవీ రివ్యూ&రేటింగ్: వంగవీటి

  ప్రధాన తారాగణం :సందీప్ కుమార్, శ్రీతేజ,వంశీ నెక్కంటి,వంశీ చాగంటి,నైనా గంగూలీ,కౌటిల్య తదితరులు

  సంగీతం : రవి శంకర్

  ఛాయాగ్రహణం : రాహుల్ శ్రీవాస్తవ,దిలీప్ వర్మ,సూర్య

  ఎడిటింగ్ : సిద్దార్థ రతుల్

  రచయితలు: చైతన్య ప్రసాద్,రాధా కృష్ణ

  నిర్మాత : దాసరి కిరణ్ కుమార్

  నిర్మాణ సంస్థ : రామదూత క్రియేషన్స్

  కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ

  వంగవీటి మోహన్ రంగ ఈ పేరే ఒక సంచలనము విజయవాడ చరిత్ర పుస్తకంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీ కలిగిన నేత,ఆయన జీవించి వున్నపుడు ఎంత చంచలనం సృష్టించాడో, చనిపోయిన తర్వాత కూడా పెను చంచలనంగా మారిపోయాడు. అలాంటి వ్యక్తి కి సంబంధించిన జీవిత చరిత్రే “వంగవీటి” సాధారణంగా ఇలాంటి సినిమా మరే దర్శకుడు చేసిన ఇంతగా అంచనాలు ఉండేవి కాదు, కానీ ఈ సినిమాని సంచలన చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీయటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రోజే (23) విడుదల అయినా ఈ సినిమా ఎలా వుందో..? అలాగే ముఖ్యంగా విజయవాడ వాసులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం..

  మూలకథ: ఆధిపత్య పోరు,తమ మాట నెగ్గాలని పట్టుదలతో విజయవాడలో రక్త చరిత్ర సృష్టించిన రెండు కుటుంబాల నేపథ్యంలో తెరకెక్కించినదే “వంగవీటి” సినిమా. చలసాని వెంకటరత్నం దగ్గర ఉంది చిన్న రౌడీగా ఎదిగిన రాధా, ఆ తరవాత కొన్ని కారణాలతో చలసాని వెంకటరత్నంని చంపేయటం, వంగవీటి రాధా స్టూడెంట్ యూనియన్ పెట్టటం,ఆయన దగ్గరకి నెహ్రు,గాంధీ వచ్చి చేరటం, ఆ తరవాత గొడవల్లో వంగవీటి రాధా చనిపోవటం, అదే సమయంలో రాధా సోదరుడిగా రంగ యూనియన్ నాయకుడిగా ఎంట్రీ ఇవ్వటం, గాంధీకి రంగ కి మధ్య గొడవలు జరగటం,వాటి వలన గాంధీ చనిపోవటం, ఆయన మరణానికి గాంధీ చిన్న తమ్ముడు మురళీ ఎలా పగ తీర్చుకున్నాడు,,? వంగవీటి రంగ ఎలా చనిపోయాడు..?, వీటన్నిటికీ గల కారణాలేంటి, ఈ హత్యలకు వాళ్ళని ప్రేరేపించినా సంఘటనలు ఎలాంటివి అనేది మూల కథ

  విశ్లేషణ: ఇప్పుడు మనకి తెలిసిన విజయవాడ వేరు, ఒక్కప్పటి విజయవాడ వేరు, దాని పేరు ఉంటే చాలు రాష్ట్రము మొత్తం గజగజలాడేది, ఇప్పుడు రాజధాని అని చెప్పుకుంటున్నారు కాని, ఒక్కపుడు అది రౌడీయిజానికి, గూండాయిజానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. ఇలాంటి వాటికీ మూలకారణమైన వ్యక్తుల జీవితాల్ని తెర చూపించాలి అంటే చాలా దైర్యం కావాలి, వర్మకి అలాంటి ధైర్యం ఉంది కాబట్టే ఇలాంటి సినిమాని తీయగలిగాడు.

  సినిమా వర్మ ఓవర్ వాయిస్ తో మొదలవుతుంది.విజయవాడలో రౌడీయిజాన్ని మొదటి భాగంలో చాలా చూపించాడు. ఒక వర్గం పై మరో వర్గం పైచెయ్యి సాధించాలనే క్రమంలో వేసే ఎత్తుగడలను ఆసక్తిగా చెప్పాడు,మొదటి భాగం చాలా ఇంట్రెస్ట్ గా సాగుతుంది. ఎప్పుడయితే రాజకీయాలు కథలోకి ప్రవేశిస్తాయో అప్పటినుండి సినిమా కొంచం వేగం తగ్గుతుంది, ఒక బలమైన సన్నివేశంతో మొదటి భాగం పూర్తి అవుతుంది.అయితే రెండో భాగంలో వర్మ తన మార్క్ చూపించలేకపోయారు. మొదటి భాగం కంటే రెండో భాగంలో బలమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ వాటిని వర్మ సరిగ్గా తెరకెక్కించలేదు.

  చివరకి రంగ హత్య వరకే చూపించి ఎండ్ కార్డు వేశాడు వర్మ, ఆ తర్వాత కూడా విజయవాడలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే వర్మ వాటిని చూపించలేదు. అలాగే కొన్ని అంశాలను కూడా వదిలేయటం జరిగింది. బహుశా వాటిని టచ్ చేస్తే వివాదాలకు ఆజ్యం పోసినట్లు అవుతుందని, వర్మ వాటి జోలికి వెళ్లలేదని తెలుస్తుంది.ఈ సినిమాలో వర్మ అందరి క్యారెక్టర్లకి అసలైన పేర్లు పెట్టాడు, మొదటి భాగంలో చాలా వరకు వర్మ యొక్క మార్క్ పక్కాగా కనిపిస్తుంది. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని బాగానే చెప్పాడు కానీ, రంగ హంతకులు ఎవరనేది చూపించలేదు. నిజ నిజాలు కనకదుర్గమ్మకు తెలుసు అంటూ చివరిలో చెప్పటం కొసమెరుపు.

  నటి నటులు: వంగవీటి రాధా, వంగవీటి మోహన్ రంగ  పాత్రలో నటించిన సందీప్ కుమార్ గురించి మొదట చెప్పుకోవాలి, ఇప్పటి జనరేషన్ కి అసలు రంగ ఎలా ఉంటాడు అనేది సరిగ్గా తెలియదు.కానీ ఈ సినిమా చూసాక బహుశా రంగ ఇలాగే వుండేవాడేమో అని అనుకుంటారు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు శాండీ. ఎమోషనల్ సన్నివేశంలో కానీ ఫ్యాక్షన్ సన్నివేశాల్లో కానీ అతడి నటన అద్భుతమని చెప్పాలి. దేవినేని నెహ్రు,దేవినేని మురళి పాత్రలు చేసిన శ్రీతేజ్,వంశీ చాగంటి తమ పాత్రలకి వన్నె తెచ్చారు. ఇందులో దేవినేని మురళీగా వంశీ నటన చాలా బాగుంది.అలాగే రత్నకుమారిగా నైనా గంగూలీ బాగా ఆకట్టుకుంది. చలసాని వెంకటరత్నంగా వంశీ నెక్కంటి, దేవినేని గాంధీగా కౌటిల్య బాగా నటించారు.

  సాంకేతిక వర్గం: ఈ చిత్ర దర్శకుడు వర్మ గురించి చెప్పాలంటే ఇలాంటి సినిమా వర్మ మాత్రమే తీయగలడని బల్లగుద్ది మరి చెప్పవచ్చు, ఇందులో వర్మ యొక్క మేకింగ్ స్టైల్ కానీ, నటీనటుల్ని వాడుకున్న విధానం కానీ సూపర్. ఇలాంటి సినిమాని తెరకెక్కించేటపుడు ఏ మాత్రం బ్యాలన్స్ తప్పిన మొదటికే మోసం వచ్చే అవకాశమా లేకపోలేదు. అయితే వర్మ అక్కడక్కడా కొంచం తప్పిన ఫైనల్ గా అవుట్ పుట్ మాత్రం చాలా బాగా ఇచ్చాడనే చెప్పాలి.

  రాహుల్ శ్రీవాస్తవ బృందం యొక్క కెమెరా పనితనం ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. 1970-1980 మధ్య కాలంలో విజయవాడ ఎలా వుంటుందనే విషయాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు. వర్మ ఆలోచనలకి తగ్గట్లు వీళ్ళ కెమెరా పనితనం ఉంది. ఇలాంటి సినిమాలకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం లాంటిది, రవి శంకర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే బ్యాక్ బోన్ లాగా నిలిచింది. ఎక్కడ లౌడ్ అనేది లేకుండా, మ్యూజిక్ ఎక్కడ కూడా కథని డిస్ట్రబ్ చేయకుండా సాగుతుంది. అయితే ఈ సినిమా యొక్క నిర్మాణ విలువలు అంతగా బాగాలేవని చెప్పుకోవాలి, క్వాలిటీ విషయంలో నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కొంచం వెనక్కి తగ్గినట్లు అనిపిస్తుంది.

  చివరి మాట : ఈ సినిమా మొత్తం రాజకీయ కోణం నుంచే సాగుతుంది,వంగవీటి పేరు ఉందని,ఆయనని హీరోగా చూపిస్తాడని భావించి వెళ్ళితే నిరాశ తప్పదు. ఫ్యాక్షన్ కథలు అంటే ఇష్టం వున్నవాళ్లు, రాజకీయాలు అంటే ఆసక్తి ఉన్నవాళ్ళకి తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది.

  గవ్వ కామెంట్స్: “వంగవీటి” కత్తి సాధారణ పదునే

  గవ్వ రేటింగ్ : 2.75/5

  గమనిక : ఇది మా అభిప్రాయం మాత్రమే

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *