• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  లా చదువుతున్న 48 ఏళ్ల బిచ్చగాడు..హ్యాట్సాఫ్

  This 48-Year-Old Beggar in Jaipur Becomes a Law Student Every

  సాధారణంగా మనం రోజు చూసే బిచ్చగాళ్ళు చేసే పని ఏమిటంటే ఉదయం నుండి బిచ్చమెత్తుకోవటం, దాని ద్వారా వచ్చిన డబ్బుతో తినటం,లేదా తాగటం, లేదా ఇంకా మిగిలిన చెడు వ్యసనాలకు బానిస అవ్వటం మనం చూస్తూనే వున్నాం. కానీ బిచ్చగాళ్లందు ఈ బిచ్చగాడు వేరయ్యా..! అని అనుకోక తప్పదుఈ బిచ్చగాడి గురించి తెలిస్తే…

  రాజస్థాన్ లోని భిల్వారా జిల్లాలో గల గంగాపూర్ కు చెందిన 48 ఏళ్ల “శివ్ సింగ్” ఉదయాన్నే లేచి అక్కడి రోడ్లను శుభ్రం చేసి, ఆ తర్వాత దారిలో వచ్చే వాళ్ళని బిచ్చమెత్తుకొని ఆ డబ్బుతో తనకి ఎంతో ఇష్టమైన ‘లా’ చదువుని కొనసాగిస్తున్నాడు. రాజస్థాన్ యూనివర్సిటీలో ‘లా’ చదువుతున్నశివ్ సింగ్ ని అతని దిన చర్యని చూస్తే మాత్రం ఆశ్చర్యపోవలసిందే. ఉదయాన్నే మూడు గంటలకి లేచి రోడ్లను శుభ్రం చేసి అలాగే అక్కడ గల రోడ్ జంక్షన్ లో సిగ్నల్స్ దగ్గర ఆగిన కార్లు అద్దాలు తుడుస్తూ డబ్బు సంపాదిస్తాడు.

  అలాగే సాయంత్రం 3 గంటలు కాగానే కాలేజీ కి వెళ్ళిపోతాడు, ఒక వేళా కాలేజీ లేని రోజున అక్కడే లైబ్రెరీ కి వెళ్లి ‘లా’కి సంబదించిన పుస్తకాలు చదువుతుంటాడు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఇంత వరకు ఒక్క రోజు కూడా కాలేజీ కి వెళ్లని రోజంటూ లేదు, క్రమం తప్పకుండా కాలేజీ కి వెళ్తున్నాడు. ఈ వయస్సులోనూ ఇలా కష్టపడి చదువుతుంది తనకి ఎంతో ఇష్టమైన లాయర్ కోటు ధరించటంకోసమే అని చెపుతున్నాడు శివ్ సింగ్.మరి దాని కోసం ఇలా అడుక్కొని పనిని ఎందుకు ఎంచుకున్నావంటే, నాకు వచ్చిన పని ఇది ఒక్కటే అని వినయంగా సమాధానము చెపుతున్నాడు.

  నిజమే కదా ఒక్కరిని మోసం చేసి, ఒకరి దగ్గర దొంగతనం చేసే పనుల కంటే కూడా ఇలా అడుక్కోవటమే ఉత్తమమైన పని కాదంటారా…? ముఖ్యంగా ఈ వయస్సులో,ఇలా చదువు కోసం కష్టపడుతున్న శివ్ సింగ్ మనకి ఆదర్శం…కదా చెప్పండి…? అన్ని వసతులు వున్నా కానీ చదువుకోడానికి బద్దకస్తులై వున్నా వారికీ ఈయన కదా ఆదర్శం…? చదువులు పూర్తి అయ్యి కష్టపడి ఉద్యోగం చేసే ఓపిక లేకుండా బలాదూర్ గా తిరిగే యువతీ యువకులకు ఈయన కదా ఆదర్శం….? ఒక్క సారి ఆలోచించండి మిత్రులారా..కష్టపడితే అందనిది ఏది లేదు.. రాజ భవంతిలో ఉండేవాడికైనా…ఇలాంటి బిచ్చగాళ్ళకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది….! హ్యాట్సప్ శివ్ సింగ్

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *