• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  భారత్ కు మద్దతు… అమెరికా భద్రతా సలహాదారు సుసాన్ రైస్

  susan-rice-calls-ajith-doval-to-extend-support-to-india-about-uri-attacks

  యూరి ఉగ్రదాడి సంఘటన తర్వాత అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఏకాకిని చేసే భారత్ చర్యలకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. తాజాగా అమెరికా యూరి దాడిని మరోసారి తీవ్రంగా ఖండించింది. అమెరికా భద్రతా సలహాదారు సుసాన్ రైస్ భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో ఈ విషయంపై ఫోన్ లో మాట్లాడారు.

  ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన సుసాన్ రైస్ దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు సంతాపం తెలిపి వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఐక్యరాజ్య సమితి నిషేదించిన లష్కర్-ఏ-తోయిబా, జైషే మొహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థల చొరబాట్లకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

  ప్రపంచం లో ఎక్కడైనా ఉగ్రవాదం, దానికి మద్దతు ఇస్తున్న వారిని సమర్ధించేది లేదని ప్రకటించిన సుసాన్ రైస్ ఈ విషయంలో ఒబామా కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారని తెలిపారు. శాంతి భద్రత పరిరక్షణలో భారత్ తన కృషిని కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *