• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  కావేరి జల వివాదం.. కర్ణాటకకు చివరి అవకాశం..

  supreme-court-gives-karnataka-a-last-chance-to-release-cauvery-water

  కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జల వివాదం ఎటూ తేలకుండా ఉంది. కొన్ని ఏళ్ళ నుంచి ఈ రెండు రాష్ట్రాలు కావేరి నీటి గురించి గొడవలు పడుతూనే ఉన్నారు. ఈ నెలలోనే కావేరి జల వివాదం గురించి రెండు సార్లు కోర్ట్ కెక్కిన విషయం తెలిసిందే. కాగా తమిళనాడుకు నీరు విడుదల చేయాలి అని సుప్రీమ్ కోర్ట్ తీర్పునివ్వగా కర్ణాటక మాత్రం ఆ తీర్పును అమలు చేయకపోగా కావేరి నీరు ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడుకు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీంతో సుప్రీమ్ కోర్ట్ తాజాగా కర్ణాటకకు ఝలక్ ఇచ్చింది.

  వివరాల్లోకి వెళ్తే.. కావేరి జలాల విడుదలకు ససేమిరా అంటున్న కర్ణాటకకు సుప్రీమ్ కోర్టు చివరి అవకాశం ఇచ్చింది. రేపట్నుంచి 6 రోజుల పాటు 6000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాలకు కర్ణాటక ప్రభుత్వం అవహేళన చేస్తూ చట్టాన్ని తొక్కి పెట్టె పరిస్థితి సృష్టిస్తోందని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

  తీర్పు అమలుకు కర్ణాటకకు ఇదే తుది అవకాశం అని తెలిపిన న్యాయస్థానం మంగళవారం నాటికి కావేరి జలాల యాజమాన్య బోర్డుని ఏర్పాటు చేయాలనీ కేంద్రాన్ని సూచించింది. అందుకోసం కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి తమ తమ సభ్యలను రేపటిలోగా నామినేట్ చేయాలనీ నిర్దేశించింది.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *