• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  బాలయ్య సినిమాలో సూపర్ స్టార్…

  superstar-amitabh-bachchan-main-role-in-balakrishna-101-movie

  నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు, ఆ సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలనీ చిత్ర బృందం భావిస్తుంది, దాని తరవాత నటసింహం తన 101వ  సినిమాని కృష్ణ వంశీ దర్శకత్వంలో చేయనున్నారు, దీనికి సంబంధించి ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు, అయితే తాజాగా ముంబయి ఫిలిం సిటీలో బాలకృష్ణ, కృష్ణ వంశీ కలిసి సూపర్ స్టార్ అమితాబ్ ని కలవటం ద్వారా  ఈ విషయాన్ని ద్రువీకరించినట్లు తెలిసింది.

  అమితాబ్ బచ్చన్ ని కలవటం వెనుక ఒక బలమైన కారణం వుంది అని సమాచారం. కృష్ణ వంశీ-బాలయ్య బాబు కలయికలో రానున్న ‘రైతు’ అనే సినిమాలో బాలకృష్ణ పాత్ర తర్వాత అంత పవర్ ఫుల్ పాత్ర మరొకటి వుంది, అని దానికి అమితాబ్ అయితే సరిపోతారు అని భావించి ఆయనని కలిసి కథని వినిపించారు. కథ లో తన పాత్ర నచ్చటంతో వెంటనే అమితాబ్ ఈ సినిమాకి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తుంది,అంతే కాదు ఈ సినిమాకి 17 రోజులు అమితాబ్ తన డేట్స్ కూడా ఇచ్చాడు అని సమాచారం.

  అమితాబ్ ఈ సినిమా ఒప్పుకోటానికి తనకి ఆఫర్ చేసిన పాత్ర నచ్చటం ఒకటే కాదు అని, పెద్దాయన నందమూరి తారకరామారావు మీద ఉన్న గౌరవం అలాగే బాలకృష్ణ మీద అభిమానం కూడా కారణమే అని తెలుస్తుంది. సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించి విలన్ల భరతం పట్టే బాలయ్య, బయట నడుచుకునే క్రమశిక్షణ లో కానీ పెద్దలని గౌరవించే విషయంలో కానీ ఆయన తండ్రి రామారావు గారికి ఏ మాత్రం తక్కువ కాదు, తాజాగా అమితాబ్ ని కలిసిన బాలకృష్ణ ఆయనకి పాదాభివందనం చేసి పెద్దలంటే తనకు గల గౌరవాన్ని మరో సారి రుజువు చేశాడు.

  అమితాబ్ గతంలో ‘అమృతవర్షిణి’ , రీసెంట్ గా నాగార్జున మూవీ ‘మనం’ లో అతిధి పాత్రలో కనిపించాడు,తాజాగా అమితాబ్ ఈ సినిమాలో నటించటానికి ఒప్పుకోవటంతో బాలకృష్ణ-కృష్ణ వంశీ చాలా సంతోషంతో ఉన్నారు. ప్రస్తుతం కృష్ణవంశీ నక్షత్రం సినిమాని తెరకెక్కిస్తున్నారు.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *