• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  కబడ్డీ విశ్వవిజేతలకు 10 లక్షల నజరానా..!

  sports-minister-vijay-goel-announced-10-lakhs-cash-prize-for-kabaddi-players

  కబడ్డీ వరల్డ్ కప్ గెలుచుకున్న భారత్ ప్లేయర్స్ పై కేంద్రం కాసుల వర్షం కురిపించింది. క్రికెట్ కు తప్ప, వేరే ఆటలను ప్రోత్సహించరనే భావం ఇండియా మొత్తం ఉన్నసంగతి తెలిసిందే. వేరే ఆటలను చిన్న చూపు చూస్తోందనే నేపథ్యంలో కబడ్డీ కురాళ్లకు క్రీడల మంత్రి విజయ్ గోయెల్ నజరానా ప్రకటించడం మంచిదే అని చెప్పాలి. వీరితో పాటు కోచ్ కు కూడా నజరానా ఇచ్చింది.

  కబడ్డీ ఆటలో మన కురాళ్లు రెచ్చిపోయి ఆడి భారత్ కు వరల్డ్ కప్ అందించారు. దీంతో ప్రభుత్వం ప్రసంశలతో  పాటు, ఒక్కొక్కరికి 10 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించింది. క్రికెట్ తర్వాత ఒక టీంకు ఈ స్థాయిలో నజరానా ఇవ్వడం ఇదే తొలిసారి. కేంద్ర క్రీడాశాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అభినందించేలా ఉంది.

  ఢిల్లీలో కేంద్ర క్రీడాశాఖ ఆధ్వర్యంలో వరల్డ్ కప్ గెలిచిన టీంకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరిని స్వయంగా సన్మానించిన క్రీడా మంత్రి గోయెల్ ఒక్కో ఆటగాడికి 10 లక్షలు నగదు ఇస్తున్నట్లు తెలిపారు. ఇంకా, కోచ్ కు కూడా సమానంగా నగదు బహుమతి ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో ఈ కబడ్డీ ఆటను ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టే విధంగా కృషి చేస్తామని క్రీడల మంత్రి విజయ్ తెలిపారు.

  ఇక ఫైనల్లో వరల్డ్ కప్ గెలుచుకోవడానికి కారణమైన అజయ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కబడ్డీ లో పూర్తీ ఆధిపత్యం ఇండియాదే అంటే నేను ఒప్పుకోననీ, ఫైనల్లో మొదటి సగం ఆట ముగిసిన తర్వాత ఇరాన్ ముందంజలో ఉందని తెలిపాడు. ఈ ఆటలో గట్టి పోటీఉంటుందని చెప్పడానికి ఆ ఫైనల్ మ్యాచ్ ఉదాహరణ అని తెలిపాడు. ఇతర దేశ ఆటగాళ్లు ఇక్కడికొచ్చి ఆట నేర్చుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *