• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  టీజర్ టాక్: శతమానం భవతి

  shatamanam-bhavati-teaser

  శతమానం భవతి ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటి నుండి ఈ సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ మరింత పెరిగింది,దానిని కంటిన్యూ చేస్తూ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను ఈ సాయంత్రం 6 గంటలకు దిల్ రాజు తన అధికారిక పేస్ బుక్ ఖాతా ద్వారా విదుదల చేశాడు “శతమానం భవతి టీజర్… విజయ దశమి శుభాకాంక్షలు… సంక్రాంతికి కలుద్దాం”. అంటూ పోస్ట్ చేశాడు.

  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు సినిమా అంటేనే కుటుంబ విలువలుకు అందులోని ఆప్యాయతలకు అద్దము పడుతుంటాయి.శతమానం భవతి కూడా అలాంటి సినిమాల కోవలోకి వస్తుంది, పచ్చని పంట పొలాల మధ్య అందమైన ఒక పల్లెటూరిలో సాగే కథగా తెరకెక్కించారు, ఇందులో శర్వానంద్ ట్రెండ్ లుక్ తో కనిపిస్తున్నాడు అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అటు మోడరన్ డ్రెస్ లోను ఇటు ట్రెడిషనల్ డ్రెస్ లోను కనిపించి ఆకట్టుకుంటుంది, ఇందులో ప్రకాష్ రాజు, జయసుధ భార్య భర్తలుగా కనిపిస్తున్నారు. టీజర్ లో వచ్చే బ్యాక్ రౌండ్ సాంగ్ చూస్తుంటే మిక్కీ జె.మేయర్ మరో సారి మాయ మ్యూజిక్ తో మాయ చేశాడు అనిపిస్తుంది, ఈ టీజర్ చూస్తుంటే “సీతమ్మవాకిట్లో సిరి మల్లెచెట్టు” సినిమా ఫ్లేవర్ కనిపిస్తుంది.

  ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నారు,అప్పుడు పెద్ద సినిమాలు పోటీలో ఉన్న తమ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్  తో  బరిలోకి దిగి కాలు దువ్వటానికి దిల్ రాజు అండ్ టీం రెడీ అవుతుంది.

   

   

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *