• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఫస్ట్ లుక్ : శతమానం భవతి

  shatamanam bhavati first look

  కొన్ని సినిమాలుకు షూటింగ్ ముందు నుంచే విపరీతమైన పాజిటివ్ బజ్ ఏర్పడుతుంది, అలాంటి సినిమాలో శతమానం భవతి ఒకటి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు, జయసుధ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు,మిక్కీ జే.మేయర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు

  సతీష్ వేగ్నేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విజయదశమి సందర్బంగా విడుదల చేసింది.దీనిలో శర్వానంద్ రోలుపై కుంకుడు కాయలు కొట్టి అనుపమకు చూపిస్తున్నట్టు ఉంది,అనుపమ సిటీ నుండి పల్లెటూరికి వచ్చిన అమ్మాయిలాగా కనిపిస్తుంది బ్యాక్ గ్రౌండ్ లో ముగ్గులు వేస్తున్న ఆడపడుచులు ఆ పక్కనే గుడి పచ్చని పొలాలు చూపించారు, అలాగే పోస్టర్ చివరన సంక్రాంతికి పండగకు కలుద్దాం..అని వేశారు,అంటే ఈ సినిమా ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే సినిమా అని చెప్పకనే చెప్పారు.

  ఈ సంవత్సరం సంక్రాంతికి విపరీతమైన పోటీ ఉన్న తన ఎక్సప్రెస్ రాజా ని విడుదల చేసి విజయం సాధించాడు శర్వానంద్, అలాగే వచ్చే సంవత్సరం సంక్రాంతికి కూడా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘ఖైదీ 150’ సినిమాలతో పోటీగా రానున్నాడు, మరి ఈ సారి ఎలాంటి ఫలితం వచ్చిదో చూడాలి.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *