• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  పాత నోట్లు మరో పది రోజులు పని చేస్తాయ్.. కేంద్రం..!

  scrapped-old-notes-will-be-accepted-till-november-24

  గత నాలుగు రోజులుగా సాధారణ ప్రజలు పెద్ద నోట్ల రద్దుతో నానా తిప్పలు పడుతున్నారు. బ్యాంకులు ఆదివారం కూడా పని చేస్తాయ్ అని చెప్పడంతో సామాన్య ప్రజలు ఆదివారం ఉదయం 6 నుంచి బ్యాంకుల వద్ద క్యూలు కట్టారు. మరోవైపు ఎటిఎం సెంటర్ ల దగ్గర కూడా భారీగా జనం గుమిగూడారు. కానీ చాలా చోట్ల ఏటీఎంలు పని చెయ్యట్లేదు.

  ఈ విషయాన్నీ గమనించిన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎంలలో రోజుకి 2000 మాత్రమే తీసుకోవాలని చెప్పిన కేంద్రం ఇప్పుడు ఆ లిమిట్ ని 2500కు పెంచింది. అంతే కాకుండా వారానికి 20000 మాత్రమే లిమిట్ ఉండేది మునుపు. ఇప్పుడు ఆ లిమిట్ ను కూడా 24000కు సడలించారు.

  పాత పెద్ద నోట్ల పై కేంద్రం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. పాత నోట్లతో మరో 10 రోజుల పాటు పౌరసేవల బిల్లులు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అంటే నవంబర్ 24 వరకు ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, ఎయిర్ పోర్టులో, పెట్రోల్ బంకులలో పాత నోట్లు చెల్లుతాయని కేంద్రం తెలిపింది.

  ఇది ఇలా ఉండగా, ఈ రోజు నవంబర్ 14 సోమవారం బ్యాంకులకు సెలవు ప్రకటించారు. గురునానక్ పుట్టినరోజు సందర్బంగా బ్యాంకులకు సెలవు ఇచ్చారు. ఇప్పటికే తిప్పలు పడుతున్న ప్రజలు, అటు ఏటీఎంలు పనిచేయక, ఇటు బ్యాంకు సెలవు కారణంగా ఈ రోజు పరిస్థితి ఎలా ఉంటుందో మరి…!!!

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *