• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  త్వరలో రూ.20, రూ.50 నోట్లు..!!

  sbi-to-dispense-rs-20-and-rs-50-notes-soon-arundati-bhattacharya

  పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రజలు పాత నోట్లు మార్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. రోజంతా క్యూలో నిలబడి చివరికి 2000 నోటుతో, 100 నోట్లతో ఇంటికి వెళ్తున్నారు. 2000 వేల నోటుకు ఎలాగూ చిల్లర దొరకట్లేదు, ఇప్పుడు ఎక్కడైనా 100 నోటు ఇస్తే వారి దగ్గరా చిల్లర లేక దానికి సరిపడా కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. త్వరలో ఆ ఇబ్బంది కూడా తొలిగిపోనుంది.

  తొందర్లోనే రూ.20 మరియు రూ.50 నోట్లను ఎస్ బి ఐ బ్యాంకులో ఇస్తామని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా చైర్మన్ శ్రీమతి అరుంధతి భట్టాచార్య తెలిపారు. బ్యాంకుల దగ్గర కొంచం రద్దీ తగ్గిన తర్వాత రూ.20,రూ.50 నోట్లు తీసుకోవచ్చని చెప్పారు.

  మంగళవారం కూడా పెద్ద ఎత్తున జనాలు బ్యాంకుల దగ్గర గుమిగూడారు. నిన్న సోమవారం గురునానక్ జయంతి సందర్బంగా బ్యాంకులకు సెలవు కావడంతో ఈ రోజు మంగళవారం ఉదయం 7 నుంచే ప్రజలు  బ్యాంకుల వద్దకు వస్తున్నారు. ఈ నేల 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు నరేంద్ర మోడీ చెప్పిన విషయం తెలిసిందే. ప్రజల దగ్గరున్న పాత 500 , 1000 నోట్లను తమ అకౌంట్ లలో జమ చేసుకోవచ్చని డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు.

  నిజాయితీగా పన్ను చెల్లించే వారి సౌకర్యార్ధం, 2.5 లక్షలు తమ భార్య బ్యాంకు ఖాతాలో, ఇంకా రైతుల బ్యాంకు ఖాతాలో వేసుకుంటే పన్ను శాఖా అధికారులు వారి జోలికి రారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *