• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  బేతాళుడి 10 నిమిషాల వీడియో

  bethaludu

  విజయ్ ఆంటోనీ అనగానే మనకి గుర్తుకువచ్చే సినిమా “బిచ్చగాడు”. కేవలం ఒక డబ్బింగ్ సినిమాగా  తెలుగులో విడుదల అయినా ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు, ఆ డబ్బింగ్ సినిమాకి వీలుకాని రీతిలో ఏకంగా 100డేస్ ఫంక్షన్ ని జరుపుకొని విజయ్ కి మంచి మార్కెట్ ఏర్పడేలా చేసింది.

  తాజాగా విజయ్ తాను తమిళంలో నటించిన “సైతాన్” మూవీని తెలుగులో “బేతాళుడు” గా నామకార్థం చేసి వచ్చే నెల డిసెంబర్  2వ తారీఖున విడుదల చెయ్యనున్నారు.అసలు ఈ శుక్రవారమే  రిలీజ్ కావలసిన ఈ సినిమా కరెన్సీ కష్టాలు వలన పోస్టుపోన్ చేసుకున్నారు.ట్రైలర్ తోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ “బేతాళుడు” పోస్టుపోన్ వల్ల సినిమా మీద ఎటువంటి ఆసక్తి జనాలకి పోకూడదని విజయ్ ఆంటోనీ తమిళ్ వెర్షన్ కి సంబంధిచిన ఒక 10 నిముషాలు సినిమాని విడుదల చేసాడు. ఈ వీడియో చూస్తూనే ఇది పక్క హర్రర్ ఫిల్మ్ అని తెలుస్తుంది, జయలక్ష్మిని వెతుకుతూ హీరో వెళ్లే సన్నివేశాలకి ఆ బస్ లో వున్నవాళ్లు అతనిని చూసే విధానం కానీ వాటికీ వచ్చే బ్యాక్ రౌండ్   మ్యూజిక్ కూడా చాలా కూడా అదిరిపోయింది,ఈ సినిమాతో ఆంటోనీ మళ్ళీ  తెలుగులో వండర్ చేయటానికి సిద్ధం అయిపోయాడని చెప్పవచు.

  ఈ సినిమాకి  ప్రదీప్ కృష్ణన్ దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ తన సొంత బ్యానర్ లో నిర్మించాడు.ఈ సినిమా విడుదల అవుతున్న డిసెంబర్ 2న రామ్ చరణ్ నటించిన “ధృవ” కూడా విడుదల అవటానికి సిద్ధంగా వుందని సమాచారం ,మరి ఈ “బేతాళుడు” ఈ సారి ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో..

   

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *