• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మూవీ రివ్యూ : సాహసం శ్వాసగా సాగిపో..

  sahasam-swasaga-sagipo-movie-review

  సినిమా పేరు: సాహసం శ్వాసగా సాగిపో..

  ప్రధాన తారాగణం: నాగ చైతన్య,మంజిమ మోహన్, బాబా సెహగల్,నాగినీడు మొదలైన వారు

  మ్యూజిక్ : ఏ.ఆర్. రెహమాన్

  ఛాయాగ్రాణం : డాన్ మెకార్థర్‌

  ఎడిటింగ్: ఆంథోనీ

  మాటలు: కోన వెంకట్‌

  ప్రొడక్షన్ హౌస్ : ద్వారకా క్రియేషన్స్

  నిర్మాత: మిరియాల రవీంద్ర రెడ్డి

  కథ-దర్శకత్వం ; గౌతమ్ వాసుదేవ మీనన్

  ఎప్పుడో తెలుగులో షూటింగ్ పూర్తి చేసుకున్న సాహసం శ్వాసగా సాగిపో సినిమా తమిళ్ షూటింగ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది, తాజాగా మోడీ తీసుకున్న నిర్ణయం వలన ఈ సినిమా విడుదలలో మళ్ళీ జాప్యం జరిగే అవకాశం ఉందని అనుకున్నారు, ఈ సరి అలాంటిది ఏమి లేకుండా అనుకున్న విధంగా ఈ రోజే (11) ప్రేక్షకుల ముందుకి వచ్చింది హిట్ కాంబో అయినా నాగ చైతన్య, గౌతమ్ మీనన్, రెహమాన్ కలయికలో వస్తున్నా సినిమా కావటంతో ఈ సినిమాపై అంచనాలను పెంచింది, మరి ఆ అంచనాలను అందుకుందో… లేదో చూద్దాం…

  మూల కథ: రజనీకాంత్ (నాగ చైతన్య) చదువు అయిపోయి ఇంట్లో ఖాళీగా ఉంటూ ఫ్రెండ్స్ తో తిరిగే కుర్రోడు,, తన చెల్లెలి క్లాసుమేట్ అయినా లీలా (మంజిమ మోహన్)ను తొలి చూపులోనే ఇష్టపడుతాడు, ఆ అమ్మాయి హీరో ఇంట్లో ఉంటూ కోర్స్ చేస్తుంది, అలా హీరో హీరోయిన్స్ ఇద్దరు బాగా క్లోజ్ అవుతారు, అనుకోకుండా ఇద్దరు కలిసి ఒక లాంగ్ టూర్ కి వెళ్ళతారు.

  అక్కడ వీళ్ళకి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, కానీ అది యాక్సిడెంట్  కాదు అని హీరోయిన్ మీద అటాక్ అని తెలుస్తుంది,ఇలా జరుగుతుండగానే లీలా వాళ్ళ అమ్మ నాన్నల మీద కూడా అటాక్ జరుగుతుంది..అసలు లీలా ఎవరు…?  తనని చంపటానికి వచ్చింది ఎవరు….? అసలు లీలా హీరోతో లాంగ్ డ్రైవ్ కి రావటానికి గల కారణం ఏమిటి…? ఆ శత్రువుల నుండి లీలా నీ హీరో ఎలా రక్షించాడు అనేది మిగిలిన కథ…

  విశ్లేషణ : ఈ సినిమా మొదటి భాగం దాదాపుగా ‘ఏ మాయ చేశావే’ సినిమా లాగే సాగుతుంది, హీరో మొదట హీరోయిన్ నీ చూడటం ఆ తర్వాత అనుకోకుండా హీరోయిన్ని హీరో తన ఇంట్లోనే కలుసుకోవటం, ఇలా చాలా వరకు ఏ మాయ చేశావే సినిమాని గుర్తుకుతెస్తుంది, అయితే ఆ ఫీల్ నీ కొంచం సేపు కంటిన్యూ చేసిన దర్శకుడు, హీరో హీరోయిన్ తో రోడ్ ట్రిప్ ప్లాన్ చెప్పించి ఆ తర్వాత సినిమాని సీరియస్ మూడ్ లోకి తీసుకోని వెళ్లిన విధానం చాలా బాగుంది, మొదటి భాగంలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య జరిగే సంఘటనలు కానీ ఆకట్టుకుంటాయి, మొదటి భాగంలోనే అన్ని పాటలని చూపించిన అవి ఎక్కడ కథని డిస్టర్బ్ చేయకుండా సాగిపోతాయి, ఇంటర్వెల్ కి ముందు వచ్చే ట్వీట్స్ తో సినిమా రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది.

  సెకండ్ ఆఫ్ మొదలైనప్పటి నుండి సినిమా పూర్తిగా యాక్షన్ లోకి మారిపోతుంది, ఎక్కడ సినిమా స్లో కాకుండా చాలా స్పీడ్ గా నడుస్తుంది, హీరోయిన్ మీద అటాక్ చేసింది ఎవరో అని తెలియకుండా సినిమాని బాగానే నడిపించారు కానీ, పూర్తిగా ఇది పోలీస్ పాత్ర చుట్టే తిప్పటం అలాగే హీరో హీరోయిన్స్ విలన్స్ నుండి పోలీసులు నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటే మళ్ళీ అదే పోలీసులు అదే విలన్స్ కి చిక్కటం మళ్ళీ ఎలాగోలా తప్పించుకొని పోవటాం లాంటివి కొంచం అసహనాన్ని కలిగిస్తాయి.

  చివరి 15 నిముషాలు సినిమాలోని ట్వీట్స్ కి సంబదించిన విషయాలను పోలీస్ ఆఫీసర్ గా నాగ చైతన్య  ఒక్కొక్కటిగా రివీల్ చేసే విధానం ఆకట్టుకుంటుంది, అలాగే యాక్సిడెంట్ జరిగినప్పుడు అన్ని సినిమాల కంటే భిన్నంగా సాంగ్ తో యాక్సిడెంట్ సన్నివేశాలను ముడిపెట్టి చూపించిన విధానం బాగుంది, హీరో హీరోయిన్లు లవ్ ప్రపోజ్ చేసుకునే సన్నివేశాలను కొత్తగా తెరకెక్కించారు, అయితే ఈ సినిమాలో ఎక్కడ కామెడీ ట్రాక్ అనేది లేకపోవటం కొంచం మైనస్,’నా లవ్ గురించి ఆంధ్ర-తెలంగాణ మొత్తం తెలుసు’… ‘ఇలాంటి గొడవలు శివ టైంలోనే అయిపోయాయి,ఇప్పుడు నాగార్జున కొడుకు కూడా హీరో అయిపోయాడు’ అని నాగ చైతన్య చెప్పే  డైలాగ్స్ అక్కడక్కడ పేలాయి. హీరో పక్కన వుండే మహేష్ అనే పాత్ర అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు.

  నటీనటులు: మొదటి భాగంలో తనకి బాగా అలవాటు అయినా పక్కింటి కుర్రాడి పాత్రే కావటంతో నాగ చైతన్య ఈజీగా చేశాడు, అలాగే సెకండ్ ఆఫ్ లో కూడా తన నటన ఆకట్టుకుంటుంది, యాక్షన్ సన్నివేశాల్లో, ఎమోషనల్ సన్నివేశాల్లో కానీ చైతు నటన గత సినిమాలా కంటే చాలా వరకు మెరుగైంది అని చెప్పవచ్చు, హీరోయిన్ కి ఇది మొదటి సినిమానే అయినా బాగానే నటించింది, కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచం లావుగా కనిపించింది, ఈ సినిమా వరకు ఓకే కానీ కమర్షియల్ సినిమాల్లో నటించాలి అంటే తాను కొంచం సన్నబడాల్సిందే, ఈ సినిమాలో ఇక ముఖ్యంగా చెప్పుకోవలసింది బాబా సెహగల్ గురించే,నెగిటివ్ షేడ్స్ కలిగిన పోలీస్ పాత్రలో చాలా బాగా నటించాడు, ఈ సినిమాలో అతని పాత్ర హీరో హీరోయిన్స్ తర్వాత హైలెట్ గా నిలుస్తుంది, హీరో ఫ్రెండ్ పాత్ర పోషించిన రాకేందుమౌళి కూడా ఆకట్టుకున్నాడు.

  సాంకేతిక వర్గం : గౌతమ్ మీనన్ ఈ కథకి ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది, దాని చుట్టూ అల్లుకున్న కధనం కూడా పర్వాలేదు,కానీ సినిమాలోని ట్వీట్స్ వాటిని రివీల్ చేసే విధానము కొంచం అతికినట్లు అనిపించవు, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు, మాటలు అర్ధాంతరంగా ముగిసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది, రెహమాన్ సంగీతం సినిమాకి బాగానే ప్లస్ అయ్యింది, యాక్షన్ సన్నివేషల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది,మెకార్థర్‌  ఛాయాగ్రహణం ఓ మోస్తరుగా వుంది, ఎడిటింగ్ లో ఇంకా అక్కడక్కడ కొన్ని కత్తెర్లు పడాల్సింది, కొన్ని సన్నివేశాలు సాగతీత లాగా అనిపిస్తుంది.

  చివరగా: ఇది అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా, కాకపోతే కామెడీ లేకపోవటం మైనస్, యాక్షన్,లవ్ చిత్రాలను ఇష్టపడే వారికీ తప్పకుండ నచ్చుతుంది, అయితే ఇప్పడు వున్నా మనీ ప్రాబ్లమ్ వలన ఎంత మంది థియేటర్స్ వైపు పోతారనేది చూడాలి.

  గవ్వ కామెంట్ : ‘సాహసం శ్వాసగా సాగిపో’ టైటిల్ కి తగ్గ సినిమా

  రేటింగ్ : 2.75 /5

  గమనిక: ఇది కేవలం మా అభిప్రాయం మాత్రమే..

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *