• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  రామ్ చరణ్ ఈసారైనా అక్కడ నిలబడుతాడా…?

  ram-cahran

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి మన తెలుగులో ఎంత క్రేజ్ ఉందో మన అందరికి బాగా తెలుసు.స్టార్ హీరో అని పిలిపించుకోవాలి అంటే కేవలం ఒక్క తెలుగులోనే మార్కెట్ ఉంటే సరిపోదు కదా. మన చెర్రీ కి ఇక్కడ రికార్డ్స్ బాగానే వున్నాయి కానీ యుఎస్ లో మాత్రం అంత గొప్ప రికార్డు ఏమి లేదనే చెప్పాలి,  ఇప్పటిదాకా మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన సినిమానే లేదు.

  యంగ్ హీరో నాని కూడా ఈ ఏడాది రిలీజ్ అయిన “భలేభలే మగాడివోయ్” సినిమాతో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిపోయాడు, అలాగే పోయిన వారం రిలీజ్ అయిన “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమాతో నిఖిల్ కూడా ఈ క్లబ్ లో చేరిపోయేలా ఉన్నాడు.యూఎస్ ప్రేక్షకులు ఎక్కువగా కామెడీ మరియు సస్పెన్స్ మూవీస్ ని ఇష్టపడుతారు, అయితే ఇప్పటిదాకా ఎక్కువగా రామ్ చరణ్ చేసింది మాస్ సినిమాలే కాబట్టి ఇది ఒక కారణం, గోవిందుడు అందరివాడేలే ఫ్యామిలీ సినిమా అయినా అనుకున్న స్థాయిలో సక్సెస్ అవలేదు, ఈసారి మాత్రం కొంచెం కొత్తగా లవ్ అండ్ సస్పెన్స్ మూవీ ‘ధృవ’తో రాబోతున్నాడు రామ్ చరణ్  కాబట్టి ఈసారి కచ్చితంగా మిలియన్ డాలర్ క్లబ్ లో చెర్రీ కూడా చేరిపోతాడు అని అంటున్నారు విశ్లేషకులు.

  ఈ సినిమా నిన్ననే సెన్సార్ పూర్తిచేసుకొని “యూ/ఏ” సర్టిఫికెట్ తెచ్చుకుంది, సెన్సార్ సభ్యుల నుండి పాజిటివ్ రిపోర్ట్స్ రావటం తో సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు చిత్ర యూనిట్.ఈ సినిమాని సురేందర్ రెడ్డి తెరకెక్కించగా అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ సినిమాని వచ్చే నెల డిసెంబర్ 9వ తారీఖున భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు..

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *