• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ‘ధృవ’ని కూడా వదలని పైరసీ

  dhruva

  రామ్ చరణ్ కధానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ధృవ’ సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని అల్లు అరవింద్ నిర్మించాడు. సినిమా షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ సినిమా మీద హైప్ పెంచుకుంటూ ఈ చిత్ర యూనిట్ భారీ ప్రచారమే చేసింది. అందుకు తగ్గట్లే ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది. అయితే ఈ సినిమాకి పైరసీ భూతం పట్టుకుంది.

  నిన్న రాత్రి కొందరు గుర్తుతెలియని పైరసీ నేరగాళ్లు ‘ధృవ’ సినిమాని యూట్యూబ్ పెట్టటం జరిగింది. ఇది గమనించిన మెగా అభిమానులు వెంటనే అప్రమత్తమై సైబర్ క్రైం అధికారులతో మాట్లాడి యూట్యూబ్ లో సినిమాని డిలీట్ చేశారు. గత రెండు సంవత్సరాలుగా సరైన హిట్ లేని రామ్ చరణ్ ఈ ధృవ సినిమాతో కలెక్షన్స్ పరంగా తన ఆకలి తీర్చుకుంటున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు జరగటం పట్ల మెగా అభిమానులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 22.5 కోట్లు సాధించి యమా జోష్ లో వుంది. ఇంకో పది రోజులు దాక సరైన సినిమా ఏది విడుదల కాకుండా అల్లు అరవింద్ చేసిన ప్రయత్నాలు ఫలించటంతో ఈ నెల 23 దాక థియేటర్లో ఎక్కువగా ధృవ సినిమా ఆడే అవకాశాలు ఉండటం వలన భారీ స్థాయిలో వసూళ్లు సాధించవచ్చు.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *