• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మూవీ రివ్యూ : ధృవ

  Dhruva

  సినిమా పేరు : ధృవ

  ప్రధాన తారాగణం : రామ్ చరణ్,రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి,పోసాని కృష్ణ మురళీ,నాజర్, నవదీప్ మొదలైనవారు

  సంగీతం : హిప్ హప్ తమిజా

  ఛాయాగ్రహణం : పి.ఎస్ వినోద్

  ఎడిటింగ్ : నవీన్ నోలి

  కథ : మోహన్ రాజా

  మాటలు : వేమా రెడ్డి

  నిర్మాత : అల్లు అరవింద్,ఎన్.వీ.ప్రసాద్

  ప్రొడక్షన్ హౌస్ : గీత ఆర్ట్స్

  స్క్రీన్ ప్లే,దర్శకత్వం : సురేంద్ర రెడ్డి

  గత రెండు సంవత్సరాలుగా సరైన హిట్ లభించక రేస్ లో వెనకబడిపోయిన రామ్ చరణ్, ధృవ సినిమాతో మళ్ళీ రేస్ లోకి రావాలనే బలమైన సంకల్పంతో రంగంలోకి దిగాడు.2015  లో తమిళంలో ఘన విజయం సాధించిన ‘తనీ ఒరువన్’ లాంటి హిట్ కథని ఎంపిక చేసుకొని  స్టైలిష్ చిత్రాల దర్శకుడిగా పేరుపొందిన సురేంద్ర రెడ్డిని ఈ సినిమాకి దర్శకుడిగా తీసుకున్నారు.అలాగే విలన్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ తమిళంలో పని చేసిన వాళ్ళనే ఈ సినిమాకి తీసుకోవటం విశేషం. ఈ రోజే (9) ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేసిందో చూద్దాం

  మూల కథ: ధృవ (రామ్ చరణ్ ) ఒక నిజాయితీ కలిగిన ఐపిఎస్ అధికారి సమాజంలో జరిగే అన్యాయాల్ని అందరి పోలీస్ ఆఫీసర్స్ మాదిరిగా కాకుండా కొత్తగా అలోచించి వాటికీ గల మూలలను సమూలంగా నాశనం చేస్తే కానీ వాటిని అరికట్టలేమని భావించి, వీటికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తిని టార్గెట్ గా పెట్టుకొని ఆ టార్గెట్ ని చేరుకొనే క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఎటువంటివి, తన టార్గెట్ అయిన సిద్దార్థ అభిమన్య (అరవింద్ స్వామి) ని ఎలా ఢీకొట్టాడు..??ఇంతకీ సిద్దార్థ అభిమన్య ఎవరు..? అతనినే ధృవ టార్గెట్ ఎందుకు చేసుకున్నాడు. ధృవ కి ఫోరెన్సిక్ నిపుణురాలు ఇషిక (రకుల్ ప్రీతి సింగ్) ఎలా పరిచయం అయ్యింది. అతని టార్గెట్ చేరుకొనే క్రమంలో ఆమె ఎటువంటి సహాయం అందించింది అనేది మిగిలిన కథ

  విశ్లేషణ:ఒక భాషలో సూపర్ హిట్ సాధించిన సినిమాని మరో భాషలో తెరకెక్కిచటం అంటే కత్తి మీద సామే. స్టోరీ లైన్ తో ఎలాంటి సమస్య ఉండదు గ్యారెంటీగా హిట్ సాధిస్తుంది అది వేరే విషయం కానీ రీమేక్ చేసే విషయంలో కొంచం తడబడిన విజయం సంగతి పక్కనపెడితే విమర్శకుల తాకిడిని తట్టుకోవటం చాలా కష్టం. కానీ సురేంద్ర రెడ్డి మాత్రం ఈ సినిమాని చాలా గొప్పగా తీసి ఒరిజినల్ మూవీ కంటే ఇదే బెస్ట్ అనిపించేలా చేశాడు.

  ఈ సినిమాలో రామ్ చరణ్ ఇప్పటి దాకా కనిపించని విధంగా కనిపించాడు.రామ్ చరణ్ కి కరెక్ట్ గా సూట్ అయ్యే రోల్ ని చాలా కాలం తరువాత చేసాడు.సినిమా మొదటి హాఫ్ చాలా బాగా వచ్చింది. హీరో విలన్ల మధ్య జరిగే మైండ్ గేమ్ సరికొత్తగా  ఉంది.రామ్ చరణ్ ఎంత బాగా నటించాడో విలన్ అరవింద్ స్వామి కూడా చరణ్ కి తగట్టుగా బాగా నటించాడు. దీనితో పాటు ఈ సినిమాకి మేజర్ హైలెట్ గా ఇంటర్వెల్ కూడా నిలవనుంది. అలాగే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన అందాలతో బాగానే అట్ట్రాక్ట్ చేసింది.ఉన్నది కొంచెం సేపే అయినా రామ్ చరణ్ రకుల్ మధ్య సన్నివేశాలు చాల బాగా కుదిరాయి.మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలాగే పాటలు కూడా సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి.అనవసరమైన చోట్ల పాటలు పెట్టకుండా కథకి సరిపోయేలాగా పాటలను పెట్టటం కూడా ప్లస్ అనే చెప్పాలి. అలాగే పాటలలో వచ్చే లొకేషన్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయ్.

  సెకండ్ హాఫ్ లో కథ కొంచెం అక్కడక్కడా స్లో అయినా సస్పెన్సు వచ్చే సీన్స్ బాగానే సాగుతాయి.సినిమా రన్ టైం కూడా కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి మన తెలుగు ప్రేక్షకులు కి తగ్గట్టు కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది అలాగే సినిమాలోని లాజిక్స్ కూడా కొన్ని సామాన్య ప్రేక్షకుడికి అర్ధం కాకపోవచ్చు.క్లైమాక్స్ మాత్రం చాలా బాగా తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి.ఇది మన తెలుగు ప్రేక్షకుడికి  సరికొత్త అనుభూతి ఇస్తుందని చెప్పటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

  నటీనటులు: గత సినిమాల కంటే భిన్నంగా రామ్ చరణ్ ఈ సినిమాలో కనిపించాడు. అతని ఫిజిక్ కానీ డైలాగు డెలివరీ కానీ చాలా బాగా వుంది. ఈ సినిమా కోసం పూర్తి వెజిటేరియన్ గా మారిపోయి చేసిన సిక్స్ ప్యాక్ కష్టం ఈ సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. అలాగే డాన్స్ విషయంలో తనకి మరో సరి తిరుగులేదని నిరూపించాడు.ఈ సినిమాలో ఎమోషనల్ పండించే విషయంలో చరణ్ నటనలో చాలా మార్పు వచ్చిందనే చెప్పాలి. రామ్ చరణ్ తర్వాత ఈ సినిమాకి మరో హీరో ఎవరు అంటే విలన్ అరవింద్ స్వామి అనే చెప్పవచ్చు అంత గొప్పగా నటించాడు.తమిళంలో ఎంత గొప్పగా ఆ పాత్రని పండించాడో అంత కంటే గొప్పగా ఇందులో నటించి మెప్పించాడు. అతని స్టైల్ కానీ అతని లుక్స్ కానీ మన తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చుతాయి అని చెప్పటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా బాగానే నటించింది. ముఖ్యంగా తన గ్లామర్ తో యూత్కి మతిపోకోటేసింది. విలన్ తండ్రిగా పోసాని కృష్ణ మురళి మెప్పించాడు. అలాగే హీరో ఫ్రెండ్స్ పాత్రలో నవదీప్ మరియు మిగిలిన వాళ్ళు తమ పాత్రలు మేర నటించారు.

  సాంకేతిక వర్గం: ఒక రీమేక్ కథే అయినా దాని మాతృకలో ఫీల్ ఎక్కడ చెడిపోకుండా దానికి తెలుగు నేటివిటీ తగట్లు సురేంద్ర రెడ్డి తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ఆయన్ని ఎందుకు స్టయిలిష్ దర్శకుడు అని అంటారో ఈ సినిమా చుస్తే మనకి అర్ధం అయిపోతుంది.అంత బాగా తెరకెక్కించాడు. అలాగే ఈ సినిమాకి సంగీతం అందించిన హిప్ హప్ గురించి చెప్పాలంటే ఇంత చిన్న వయస్సులోనే అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయం. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి ప్రాణం అనే చెప్పాలి అంత పర్ఫెక్ట్ గా అందించాడు. ఇక సినిమాటోగ్రఫీ విషయాన్ని వస్తే పి.ఎస్ వినోద్ తన కెమెరా పనితనం మరో మరు చూపించాడు. హీరో,హీరోయిన్,విలన్ లను మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని చాలా అందంగా చూపించాడు. అలాగే కాశ్మీర్ యొక్క అందాలను తన కెమెరాలో బాగానే బంధించాడు.ఈ సినిమా నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, ప్రతి ఫేమ్ లోను గీత ఆర్ట్స్ నిర్మాణ విలువలు కనిపిస్తూనే ఉంటాయి. దర్శకుడి అభిరుచికి తగ్గట్లు ఈ సినిమాని నిర్మించిన ఘనత అల్లు అరవింద్ కి దక్కుతుంది.

  చివరి మాట : కేవలం ఒక మెగా ఫ్యామిలీ అభిమాని మాత్రమే కాకుండా సామాన్య ప్రేక్షకుడు సైతం ఈ సినిమాని చూసి అభినందించకుండా ఉండలేరు. తమిళ్ తనీ ఒరువన్ సినిమా చూసి ధృవ కి వెళ్ళితే అంతగా కిక్ అనిపించదు కానీ డైరెక్ట్ గా ధృవ సినిమా చుస్తే తప్పకుండా థ్రిల్ ఫీల్  అవుతారు.

  గవ్వ కామెంట్ : టార్గెట్ ఛేదించిన ధృవ

  రేటింగ్ : 3.25 / 5

  గమనిక : ఇది కేవలం మా అభిప్రాయం మాత్రమే

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *