• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    ఇంతకీ మిస్టర్‌ సి అంటే ఎవరో తెలుసా…?

    ram-charan-and-upasana-gym-video

    నిత్యం బిజీగా ఉండే హీరోలు తమ ఫ్యామిలీతో కలిసి ఉండేది చాలా తక్కువే, ముఖ్యంగా అగ్రశ్రేణి హీరోలు తమ జీవిత భాగస్వామితో అతి తక్కువ సమయమే గడుపుతారు, అయితే ఆ సమయాన్ని తమ స్వీట్ మెమొరీస్ గా మలుచుకోటానికి చూస్తుంటారు. అసలు విషయానికి వస్తే, ఎప్పుడూ అభిమానులతో టచ్ లో ఉంటూ రామ్ చరణ్ కి సంబంధించిన విషయాల్ని అభిమానులతో పంచుకునే ఉపాసన ఈ రోజు ఒక వీడియోను పోస్ట్ చేసింది.

    తాజాగా రామ్ చరణ్ అతని భార్య ఉపాసన కలిసి జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి ఉపాసన తన ట్విట్టర్ లో పెట్టి ‘జంటగా వ్యాయామం చేయడమంటే నాకిష్టం. ఇప్పుడు మిస్టర్‌ సి(చరణ్‌) గోల్స్‌ను సెట్‌ చేస్తారు, మేము తరచూ దీన్ని చేస్తూ ఉండాలని ఆశిస్తున్నాను’ అంటూ పోస్ట్ చేసింది, ఈ వీడియోలో రామ్ చరణ్ హెడ్ సెట్ పెట్టుకొని చాలా సీరియస్ వ్యాయామం చేస్తున్నాడు అతని పక్కనే ఉపాసన కూడా జిమ్ చేస్తూ ఉంది. సో అర్ధం అయిందిగా మిస్టర్‌ సి అంటే ఎవరో…

    ప్రస్తుతం రామ్ చరణ్, సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ‘ధృవ’ సినిమాలో నటిస్తున్నాడు, ఈ సినిమాని గీత ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు, ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది, ఈ సినిమాని డిసెంబర్ లో విడుదల చేయనున్నారు.

     

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *