• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    రజని సినిమాలో మరో బాలీవుడ్ విలన్

    robo-2-0

    సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘రోబో 2.0’ గతంలో వచ్చిన రోబోకి సీక్వెల్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే, అయితే రోబో 2.0 అక్షయ్ కుమార్ తో పాటు మరో బాలీవుడ్ నటుడు కూడా నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్ర పోషిస్తున్నారు.

    సుధాన్షు పాండే అనే బాలీవుడ్ నటుడు రజనీ సినిమాలో నటిస్తున్నాడు, ‘ఇందులో డా. బోరా కొడుకుగా నటిస్తున్నానని, నాకు అక్షయ్ కుమార్ కి ఒక ఫైట్ కూడా ఉంటుందని, అలాగే రజనీ సర్ కి నాకు మధ్య కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయని, ఇందులో నాది కొంచం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయినా, మెయిన్ విలన్ మాత్రం అక్షయ్ కుమారే’ అంటూ స్వయంగా అతనే ప్రకటించాడు.

    ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి, రజనీకాంత్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు,రజనీ సరసన అమీ జాన్సన్ కధానాయికగా నటిస్తుంది, ఏ.ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు, దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని త్వరలోనే విడుదల చేయనున్నారు

     

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *