• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  రజినీ సినిమా సీక్వెల్ లో విజయ్

  Rajinikanth

  సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బాస్టర్ హిట్స్ లో ఒకటి “అన్నామలై”.ఈ సినిమా వచ్చినపుడు అప్పటి దాకా ఉన్న రికార్డ్స్ అన్నిటిని తుడిచి పెట్టేసింది. మళ్ళీ  రజినీ “భాష” విడుదల అయ్యేవరకు ఈ సినిమాదే రికార్డు. ఈ రెండు సినిమాలకి కూడా దర్శకుడు ఒకడే అతనే సురేష్ కృష్ణ.”అన్నామలై” సినిమా మన తెలుగు లో “కొండపల్లి రాజా” గా రీమేక్ చేస్తే ఇక్కడ కూడా ఘణ విజయం సాధించింది.

  అయితే ఇప్పుడు “అన్నామలై” సినిమాకి సీక్వెల్ ని తీసే పనిలో పడ్డాడంట ఒక డైరెక్టర్.ఇందులో రజిని కాంత్ హీరో గా నటిస్తున్నాడు అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది. ఈ సినిమా సీక్వెల్ కోసం తమిళ్ ఇళయదళపతి విజయ్ నటించునున్నాడని సమాచారం. కథ ఒకే అయ్యింది ఎలాగూ దర్శకుడు వున్నాడు ముఖ్యంగా నిర్మాత కూడా దొరికాడు కాదా అనుకోని సినిమాని సెట్స్ మీదకి తీసుకోని వెళ్ళలేదు విజయ్.

  “అన్నామలై” సినిమాలో నటించిన హీరో రజిని కాంత్ దగ్గర అలాగే ఆ చిత్ర నిర్మాత దగ్గర కూడా అనుమతి తీసుకోవాలని అనుకున్నాడు విజయ్.  ప్రస్తుతం ఇద్దరు నటిస్తున్న సినిమాల షూటింగ్స్ ఒకే దగ్గర జరగటం తో విజయ్ రజినీకాంత్ ని కలిసి అడిగితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అంతేకాకుండా నిర్మాతతో కూడా తనే మాట్లాడతానని రజిని చెప్పాడంట. ఒక వేళా నిర్మాత కూడా అనుమతిస్తే ఈ సినిమా తొందరలోనే సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *