• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  శాతకర్ణి కి రాజమౌళి సహాయం

  rajamouli-help-to-gautamiputra-satakarni

  బహుశా ఇలాంటి న్యూస్ వినటానికి కొంచెం కొత్తగానే వినిపిస్తుంది, కానీ అందులో నిజం లేకపోలేదు, నందమూరి బాలకృష్ణ  100వ సినిమాగా క్రిష్ తెరకెక్కిస్తున్న గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలనీ చిత్ర బృందం తీవ్రంగా కృషి చేస్తున్నారు, అదే సమయంలో సినిమా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా చూస్తున్నారు.

  ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అయిన యుద్ధ సన్నివేశాలు ఇప్పటికే తెరకెక్కించారు, అయితే వాటికీ సంబంధించిన గ్రాఫిక్స్ విషయంలో కొంచెం క్రిష్ బృందం టెన్షన్ పడుతున్నారు అని సమాచారం, అందుకు కారణము లేకపోలేదు, బాహుబలి సినిమాకి సంబంధించి యుద్ధ సన్నివేశాలలో ఆలస్యం కావటం వలనే బాహుబలి మొదటి భాగం అప్పట్లో చెప్పిన టైమ్ కంటే కొంచెం ఆలస్యంగా విడుదల అయింది, అయితే ఇలాంటి వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని శాతకర్ణి టీమ్ రాజమౌళి సహాయాన్ని కోరింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

  ఇప్పటికే బాహుబలి 2 కు సంబంధించిన కొన్ని లాంగ్ గ్రాఫిక్స్ యుద్ధసన్నివేశాలు చిత్రీకరించారు, వాటిని శాతకర్ణి యుద్ధ సన్నివేశాల కోసం ఉపయెగించటానికి రాజమౌళి అంగీకరించినట్టు తెలుస్తుంది. బాహుబలి, శాతకర్ణి లో కొన్ని సన్నివేశాలకు ఒకేలాంటి గ్రాఫిక్స్ అవసరం కావటంతో, వాటిని కూడా రాజమౌళి స్వయంగా దగ్గర ఉండి మరీ ఫినిష్ చేయటానికి ఒప్పుకున్నాడు, అని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి సమాచారం అందింది. రాజమౌళి స్వభావం గురించి బాగా తెలిసిన వాళ్ళు ఇలాంటి సహాయం చేయటానికి ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు అని చెపుతున్నారు..

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *