• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  రాజమౌళి బర్త్ డే స్పెషల్‌

  rajamouli birthday special story

  ఎస్.ఎస్. రాజమౌళి సినీ జనాలకి పరిచయం అవసరం లేని పేరు, సక్సెస్ ని తన ఇంటి పేరుగా మార్చుకున్న దర్శకుడు, ఎంత ఎదిగిన ఒదిగివుండే మనస్తత్వం రాజమౌళిది,యావత్తు భారతదేశం గర్వించాగలిగిన ఈ దర్శక ధీరుడి పుట్టినరోజు సందర్బంగా స్పెషల్‌ స్టోరీ..

  కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి అలియాస్ ఎస్.ఎస్. రాజమౌళి.. సినిమాని ప్రెసెంటేషన్ చేయటంలో కానీ దానిని ప్రమోషన్స్ చేయటంలో కానీ రాజమౌళి రూటే సపరేట్, ప్రేక్షకుడి నాడీ తెలిసిన దర్శకుడు ఆయన, ప్రేక్షకులని కథలోనికి ఎలా తీసుకోని వెళ్లాలో ఆయనకి తెలిసినంతగా మరి ఎవరికీ తెలియదు అనే చెప్పాలి. ఆయన సినిమాలో హీరో మొదటిలో ఒక సామాన్యుడిగా ఉంటాడు, విలన్ చేసే అన్యాయాల్ని భరిస్తూ ఉంటాడు, అవి చూస్తున్న సగటు ప్రేక్షకుడి ఆగలేక విలన్ ని కొట్టాలనే కసితో రగిలిపోతున్న సమయంలో హీరో లోని హీరోయిజాన్ని బయటకు తీస్తాడు,ఇక ప్రేక్షకకుడు ఆ హీరోయిజాన్ని చూస్తూ మైమర్చిపోయేలా చేస్తాడు, స్టూడెంట్ నెం.1 నుండి బాహుబలి దాక ఆయన తీసిన సినిమాలని చుస్తే ఇదే కనిపిస్తుంది.

  ఒక్క హీరోయిజం పండించటంలోనే కాదు నవరసాలు పండించుటలోను ఆయనకు ఆయనే సాటి,స్టూడెంట్ నెం.1 లో తండ్రి ,కొడుకుల అనుబంధం, ఛత్రపతిలో తల్లీ,కొడుకు ఆప్యాయత, విక్రమార్కుడులో తండ్రి,కూతుర్లా అనురాగం, మగధీర, ఈగ సినిమాల్లో ప్రేయసి,ప్రేమికుడి ప్రేమానుబంధంను చూపించి మన మనస్సుని హత్తుకొనేలా తెరకెక్కించటం జక్కన్నకే చెల్లింది.

  సాంకేతికను అందిపుచ్చుకోవటంలో రాజమౌళి ఎప్పుడు ముందే ఉంటాడు, ఒక ఈగతో సినిమా తీయటం అంటే మాములు విషయం కాదు, ఆ సినిమాల్లో ఎక్కువ భాగం గ్రాఫిక్స్ తో తీశారు,కానీ ప్రేక్షకుడికి ఆ ఫీలింగ్ కలగకుండా చేయటం రాజమౌళి గొప్పతనం,అలాగే విజువల్‌ వండర్ గా తెరకెక్కిన బాహుబలి గురించి ఎంత చెప్పిన తక్కువే ఆ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినీ పతాకాన్ని రెపరెపలాడించిన ఘనత జక్కన్నది.

  cuyswnjumaab_w8

  ఆయన సినిమాల్లో హీరోలే కాదు వాళ్ళు వాడే ఆయుధాలు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి, సింహాద్రి లో ఎన్టీఆర్ చేత పట్టించిన కత్తి ఎన్ని రికార్డులని తెగనరిగిందో తెలిసిందే,ఛత్రపతిలో ప్రభాస్,విక్రమార్కుడులో రవితేజ వాడిన ఆయుధాలు ఎంత పవర్ ఫుల్లో చెప్పాల్సిన అవసరం లేదు, అలాగే అనుష్క,తమన్నా లతో కత్తి పట్టించాడు, ఇది అంత ఒక ఎత్తు అయితే ఒక జీవి అయినా ఈగకి సూదిని ఆయుధంగా మలచటం రాజమౌళికే సాధ్యం.

  రాజమౌళి తన చిన్నతనంలో చదువుకున్న మహాభారతం,రామాయణం లాంటి పురాణ గాధల  ప్రభావం తన సినిమాలపై ఎప్పుడు ఉంటుంది అని చెప్పేవాడు, తన గురువు అయినా రాఘవేంద్రరావు తో “పనిరాక్షసుడు” అని,జూ.ఎన్టీఆర్ తో జక్కన్న అని పిలిపించుకోవటం రాజమౌళికే చెల్లింది, రాజమౌళి తీసే సన్నివేశాలకి తాను సంగీతంతో మరో మెట్టు ఎక్కించిన ఘనత ఆయన అన్నయ్య కీరవాణిది, రాజమౌళి సినీ ప్రస్థానం నుండి ఆయన ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉండు రాజమౌళి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

  ఈ రోజు రాజమౌళి గారి పుట్టినరోజు సందర్బంగా ఆయనకి మా గవ్వ తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు , ఆయన విజయ యాత్ర ఇలాగే దిగ్విజయంగా కొనసాగి ఎన్నోఅద్భుతమైన చిత్రాలను అందించాలని కోరుకుంటున్నాము.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *