• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మూవీ రివ్యూ : “ప్రేమమ్”

  premam-movie-review

  చిత్రం పేరు: ప్రేమమ్
  ప్రధాన తారాగణం: నాగ చైతన్య, శృతిహాసన్, అనుపమ పరమేశ్వన్,మడొన్నా సెబాస్టియన్,విక్టరీ వెంకటేష్,నాగార్జున,చైతన్య కృష్ణ,ప్రవీణ్,శ్రీనివాస రెడ్డి,పృథ్వి రాజ్
  మ్యూజిక్: గోపి సుందర్,రాజేష్ మురుగేశన్
  ఛాయాగ్రహణం:కార్తీక్ ఘట్టమనేని
  ఎడిటర్:కోటగిరి వెంకటేశ్వర రావు
  నిర్మాత: పి.డి.వి. ప్రసాద్,ఎస్. నాగ వంశీ
  స్క్రీన్ ప్లే,దర్శకత్వం: చందు మెండేటి

  మలయాళంలో సూపర్ హిట్ సాధించిన “ప్రేమమ్” అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు,ఒక సూపర్ హిట్ సినిమాని రీమేక్ చేయటం అంటే కత్తి మీద సామే,ప్రతి చిన్న విషయాన్ని దాని మాతృకతో పోల్చి చూస్తుంటారు,అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ మూవీ ఎన్నో అంచనాలు మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది, మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా లేదా అంటే రివ్యూ చూడాలసిందే…

  మూల కథ: విక్రమ్ (నాగ చైతన్య) స్కూల్ డేస్ లో హేమ(అనుపమ పరమేశ్వన్) ను ప్రేమిస్తూ ఆమె ని ఇంప్రెస్ చేయటానికి ప్రయత్నిస్తుంటాడు, అనుకోకుండా హేమ ఒక చోట వేరే అబ్బాయితో కనిపిస్తుంది, ఆ తర్వాత విక్రమ్ కాలేజీ లెక్చరర్ ని సితార(శృతిహాసన్) ప్రేమిస్తాడు, కానీ కొన్ని అనుకోని సంఘటనలు వలన ఈ ప్రేమ కూడా విఫలం అవుతుంది, ఆ తర్వాత విక్రమ్ తన చదువును పూర్తి చేసి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తాడు, ఆ తర్వాత మడొన్నా ప్రేమలో పడుతాడు కానీ ఈ లవ్ స్టోరీ కి కూడా కొన్ని సమస్యలు వస్తాయి,ఒక  చిన్న ట్వీట్ తో కథే మారిపోతుంది,అసలు విక్రమ్, సితార (శృతిహాసన్) విడిపోవటనికి గల కారణం ఏంటి,విక్రమ్ మడొన్నాకి వచ్చిన సమస్యలు ఏంటి, చివరకి ఆ ముగ్గురిలో విక్రమ్ ఎవరిని పెళ్లి చేసుకున్నారు అనేది మిగిలిన కథ..

  విశ్లేషణ: మనం గతంలో చెప్పుకున్నట్లు ఇలాంటి స్టోరీలను స్క్రీన్ పై ప్రెసెంటేషన్ చేయటం చాల గొప్ప విషయం ఇందులో దర్శకుడు విజయం సాధించాడు అనే చెప్పాలి, స్కూల్ సన్నివేశాల నుండి కథ స్టార్ట్ అవుతుంది, నాగ చైతన్య తాను ప్రేమిస్తున్న హేమ కి లవ్ ప్రపోజ్ చేయటానికి ఒక రోజు గుడి దగ్గరకి వెళ్తాడు అక్కడ చైతు కి అనుపమ కి మధ్య కొన్ని ఆసక్తి కారమైన సన్నివేశాలు నడుస్తాయి, ఆ తర్వాత అనుకోకుండా ఒక రోజు అనుపమను ఒక అబ్బాయితో చూస్తాడు, ఇంకా అక్కడి నుండి కథ ఆసక్తికరంగా మారుతుంది, ఆ తర్వాత కథ 2005 లోకి వస్తుంది నాగ చైతన్య చదివే కాలేజీ లో గ్యాంగ్ వార్ నడుస్తుంది, కాలేజీ కి నాగ చైతన్య కలిగిస్తున్న ఇబ్బందుల గురించి ప్రిన్సిపాల్ పిలుస్తాడు, అప్పుడు నాగ చైతన్య అంకుల్ గా విక్టరీ వెంకటేష్ కనిపిస్తాడు, అదే కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తుంది శృతిహాసన్. నాగ చైతన్య,శృతిహాసన్ ని ప్రేమిస్తూవుంటాడు అక్కడే కథ ఒక కీలక పరిణామం చోటుచేసుకుని సినిమా ఇంటర్వెల్ కి వెళ్తుంది.

  ఆ తర్వాత నాగ చైతన్య,శృతిహాసన్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి,శృతిహాసన్ కి ఒక యాక్సిడెంట్ అవటం దానిని చూడటానికి నాగ చైతన్య అక్కడికి పోవటం అప్పుడు వాళ్ళయిద్దరి మధ్య మంచి హార్ట్ టచింగ్ సన్నివేశాలు ప్రతి ఒకరిని కదిలిస్తాయి, ఆ తర్వాత నాగ ఛైతన్య మడోన్నాప్రేమలో పడుతాడు, వీళ్ళ కథలో కూడా అనుకోని సంఘటనలు జరిగి మడోన్నా తన ఎంగేజ్మెంట్ గురించి అతనికి చెప్పింది.అక్కడి నుండి సినిమా క్లైమాక్స్ కి పోతుంది.నా జాతకంలో “ఎస్” లెటర్ తో స్టార్ట్ అయ్యే పేరుగల అమ్మాయి నా భార్యగా వస్తుంది అని నాగ చైతన్య చెప్పటం సూపర్ గా ఉంటుంది అలాగే వెంకటేష్ ఎంట్రీ, నాగార్జున ఓవర్ వాయిస్ చివరలో నాగ చైతన్య తండ్రిగా నాగార్జున రావటం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలు..

  నటీనటులు:తెలుగులో ఈ పాత్రను నాగ చైతన్య తప్ప ఎవరు చేయలేరు అనే అంతగా నటించాడు, స్కూల్ కుర్రాడిగా,కాలేజీ స్టూడెంట్ గా, ఆ తర్వాత మెచ్యూర్ లవర్ గా తన నటన చాలా గొప్పగా ఉంది అనే చెప్పాలి,శృతిహాసన్ కూడా చాలా బాగా నటించింది, ముఖ్యముగా ఎమోషనల్ సన్నివేశంలో ఆకట్టుకుంది, అనుపమ,మడోన్నా తమ పాత్రలకి తగిన న్యాయం చేశారు, అలాగే బ్రహ్మాజీ, చైతు మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి.

  సాంకేతిక వర్గం: ఈ సినిమాలో ముఖ్యముగా చెప్పుకోవలసింది సంగీతం గురించి గోపి సుందర్,రాజేష్ మురుగేశన్ మ్యూజిక్ ఈ సినిమాని మరి స్థాయికి తీసుకోని వెళ్ళింది, అలాగే కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం కూడా బాగుంది, సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు గారు ఎడిటింగ్ కూడా బాగుంది సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ విలువలు ప్రతి ఫేమ్ లోను బాగా కనిపిస్తుంది, చివరగా చందు కథని డీల్ చేసిన విధానం బాగుంది, అక్కడక్కడా సినిమా కొంచెము స్లో అయినట్టు అనిపిస్తుంది.

  “గవ్వ” కామెంట్: మరో సారి మాయ చేసిన ప్రేమమ్

   రేటింగ్: 3 /5

  ‘గ’మనిక: ఇది కేవలం మా అభిప్రాయం మాత్రమే..

  PBN

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *