• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ప్రకాష్ రాజ్ ను ఇజం నుండి తప్పించింది ఇతనేనా

  prakash-raj-and-jagapati-babu

  పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఇజం సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకి వచ్చింది, ఇందులో కళ్యాణ్ రామ్ నటనకి విమర్శకుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి, ఇందులో విలన్ గా జగపతి బాబు నటించాడు,అయితే ఈ సినిమాలో విలన్ గా ప్రకాష్ రాజు నటించాల్సింది,పూరీ సినిమాలో విలన్ క్యారెక్టర్స్ ఎక్కువగా ప్రకాష్ రాజ్ చేసేవాడు, ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నటుడు ఆయన, కానీ ఆ స్థానంలో జగపతి బాబు నటించాడు, తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇలా జరగటానికి గల కారణాన్ని జగపతి బాబు వెల్లడించాడు.

  ఇజం సినిమాలో విలన్ గా మొదట ప్రకాష్ రాజ్ నే అనుకున్నారంట, ఈ సినిమాలో విలన్ రోల్ గురించి తెలుసుకున్న జగపతి బాబు ఎలా అయినా ఆ రోల్ తానే చేయాలనీ ఫిక్స్ అయ్యాడు, కానీ ఇదే విషయాన్ని పూరీని అడిగితే ప్రకాష్ రాజ్ కి  పూరీకి మధ్యనున్న అనుబంధం కారణంగా తనకి ఆ అవకాశము రాదు, అని తెలుసుకొని ఇజం సినిమా వ్యవహారాలు చూసే కళ్యాణ్ రామ్ బావమరిది జగపతి బాబుకి బాగా సన్నిహితుడు కావటం వలన, అతడి ద్వారా రాయబారం నడిపి ఈ సినిమాలో నటించే అవకాశాన్ని సంపాదించాడట. ఇదే విషయాన్ని జగపతి బాబు ఇంటర్వ్యూ లో చెప్పటంతో అదే కార్యక్రమంలో ఉన్న పూరీ జగన్నాధ్ షాక్ కి గురయ్యాడు.

  వెంటనే తేరుకొని అవును ఈ కథని నేను ఐదు సంవత్సరాలు క్రితమే రాసుకున్న మొదటిలో ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విలన్ గా అనుకున్నాము అని వెల్లడించాడు పూరీ, ఈ సంధర్బంగా నేను మీరు అనుకున్న విధంగా ప్రకాష్ రాజ్ స్థాయిలో నటించానా…? అని జగ్గుబాయ్ పూరీని అడగ్గా ‘చాలా బాగా నటించారు, మీ స్థాయిలో మీరు నటించారు’ అని సమాధానం చెప్పాడు.అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం జగ్గూభాయ్ ఈ రకంగా చేశాడన్నమాట

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *