• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    కాటమరాయుడు టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

    kalyan

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది “సర్దార్ గబ్బర్ సింగ్” రిలీజ్ చేసి పరాజయాన్ని చవి చూసాడు. అందుకేనేమో వరుసగా సినిమాలకి గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేసాడు పవన్. ప్రస్తుతం “కాటమరాయుడు” సినిమా సెట్స్ మీద ఉండగా ఈ సినిమా పూర్తవ్వగానే త్రివిక్రమ్ తో సినిమా పట్టాలెక్కించనున్నాడంట. దీని తర్వాత నేసన్ డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడని సమాచారం.

    ఇదంతా ఇలా ఉండగా “కాటమరాయుడు” సినిమా తో న్యూ ఇయర్ కి పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులకి జోష్ ని పెంచిన పవర్ స్టార్ సంక్రాంతి కి మరింత జోష్ పెంచెయ్యటానికి టీజర్ ని విడుదల చెయ్యనున్నారంట. ఈ టీజర్ ని 14న నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ లో విడుదల చేస్తారంట.ఈ విషయాన్నీ స్వయంగా చిత్ర యూనిట్ వాళ్ళే తెలియజేసారు. “సర్దార్ గబ్బర్ సింగ్” ని నిర్మించిన శరత్ మరార్ ఈ సినిమాని కూడా నిర్మించగా డైరెక్టర్ గా డాలీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. శృతి హాసన్ రెండో సారి పవన్ కళ్యాణ్ సరసన నటిస్తుంది.మార్చ్ లో ఉగాది శుబాకాంక్షలుగా ఈ సినిమాని విడుదల చెయ్యనున్నారు.

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *