• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మెగా ఈవెంట్ లో పవన్ ఫాన్స్ అరాచకం

  Pawan Kalyan Fans Fight at Khaidi no 150 Pro Release Function

  చిరంజీవి 150 వ సినిమా “ఖైదీ నెం 150” ప్రీ రిలీజ్ ఫంక్షన్ మొన్న విజయవాడ-గుంటూరు మధ్యలో గల హాయ్ ల్యాండ్ లో కన్నుల పండగగా జరిగింది. దాదాపుగా ఐదున్నర లక్షలు మెగా అభిమానులు ఈ ఈవెంట్ కి తరలివచ్చి తమ అభిమాన కథనాయకుడిని సాదరంగా వెండితెరకి స్వాగతం పలికారు. ఆ అభిమానం చూసి మెగా ఫ్యామిలీనే కాదు రెండు రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇది అంత ఒక ఎత్తు అయితే,పవన్ కళ్యాణ్ ఫాన్స్ చేసిన అరాచకం మరో ఎత్తు.

  సాదారణంగా మెగా హీరోల ఫంక్షన్ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ జపం ఎక్కువగానే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అది శృతిమించిన సంఘటనలు లేకపోలేదు. తాజాగా జరిగిన ఈ ఫంక్షన్ లో పవన్ నామ జపం బాగానే జరిగింది. ఒకానొక టైములో మెగాస్టార్ మాట్లాడేటప్పుడు కొంతమంది పవన్ అభిమానులు జనసేన జెండా పట్టుకొని పవన్ కళ్యాణ్..పవర్ స్టార్ నినాదాలు చేశారు. అసహనానికి గురైనా చిరంజీవి జెండా దించామని,సైలెంట్ గా ఉండమని చెప్పినా వాళ్ళు వినలేదు. చివరికి ఫంక్షన్ అయిపోయిన తర్వాత ప్రేక్షకుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన చైర్స్ ని పవన్ అభిమానులు విరగకొట్టి,గాలిలోకి ఎగరవేసి, పెద్ద కుప్పగా పోసి నానా రచ్చ చేశారు.

  దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అభిమానం అయితే ఉండాలి కానీ ఇలా పిచ్చి పనులు చేయకూడదని, ఈ ఫంక్షన్ కి రాకపోవటం పవన్ కళ్యాణ్ సొంత నిర్ణయమని, అయన అభిమానులైన వారు పవన్ నిర్ణయాన్ని గౌరవించవలసిన బాధ్యత ఉందని,కానీ అవి ఏమి పట్టించుకోని కొందరు అత్యుత్సహమైన ‘వీరా’భిమానులు చేసే వాటి వలన అటు మిగిలిన పవర్ స్టార్ అభిమానులకి,ఇటు పవర్ స్టార్ కి చెడ్డపేరు వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా ఇలాంటి పనులు చేయకుండా నిజమైన పవర్ స్టార్ అభిమానులు అనిపించుకోవాలని అనేకమంది అభిప్రాయపడుతున్నారు. చూద్దాం…మరి పవన్ అభిమానుల తీరులో మార్పు వస్తుందో లేదో..

   

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *