• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  బన్నీకి ప్లేస్ లేకుండా చేసిన పవన్

  Allu Arjun and pawanKalyan

  నిన్న సాయంత్రం నుండి సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేసిన సినిమా ఏమైనా వుందా అంటే అది సాయి ధరమ్ తేజ్ ‘విన్నర్’ మూవీ, కేవలం హీరో,హీరోయిన్ ఫోటోలు మాత్రమే వదిలి ఫిబ్రవరి 24 న రిలీజ్ అంటూ ప్రకటించారు, ఎలాంటి హడావిడి లేకుండా కేవలం రిలీజ్ డేట్ ని లాక్ చేయటం కోసమే ఫోటోలను వదిలారంటే విడుదల తేదికి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారో అర్ధం అవుతుంది, బాగా ఆలోచిస్తే ఇక్కడే అసలు పాయింట్ దాగి వుంది…

  సాయి ధరమ్ తేజ్ కి కర్త,కర్మ,క్రియ అంత తన మూడో మేనమామ పవన్ కళ్యాణ్, ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేయటానికి కూడా ఆయనే కారణమని అనే వాళ్ళు లేకపోలేదు, ఎందుకంటే జనవరిలో చిరంజీవి వస్తున్నాడు, పవన్ ఏమో తన సినిమా కాటమరాయుడుని మార్చి నెలలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో వున్నాడు, ఇదే విధంగా అల్లు అర్జున్ కూడా తన ‘డిజె’ త్వరగా పూర్తి చేసి ఫిబ్రవరి లాస్ట్ లో లేదా మార్చి మొదటి వారంలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం.

  ఇది గమనించిన పవన్ కళ్యాణ్ తన మేనల్లుడి సినిమాని ఫిబ్రవరి లో వచ్చేలా ప్లాన్ చేశాడు, అలాగే మహా శివరాత్రి కూడా కలిసి వచ్చేలా విన్నర్ సినిమాని విడుదల చేస్తున్నారు, సో జనవరి,ఫిబ్రవరి,మార్చి మెగా క్యాలెండర్ నిండిపోయింది, ఏప్రిల్ బాహుబలి వస్తుంది కాబట్టి మిగిలిన పెద్ద సినిమాలు వచ్చే దైర్యం చేయవు,సో అల్లు అర్జున్ ‘మే’ నెలకి వెళ్ళాలి  కానీ అదే నెలలో మహేష్ మూవీ వచ్చే అవకాశముంది, అప్పుడు కూడా బిగ్ కాంపిటీషన్ తప్పకపోవచ్చు అనేది విశ్లేషకుల మాట..

  సో పవన్ కళ్యాణ్ విన్నర్ సినిమాతో బన్నీకి దాదాపుగా అయిదారు నెలలు రిలీజ్ అవటానికి ప్లేస్ లేకుండా చేశాడనే చెప్పాలి,ఇప్పటికే బన్నీకి మెగా ఫ్యామిలీకి మధ్య కొంచం గ్యాప్ పెరిగిందని వార్తలు వస్తున్నాయి,అప్పట్లో ‘చెప్పను బ్రదర్’ అంటూ బన్నీ చేసిన కామెంట్స్ ఎంత పెనుదుమారం లేపయ్యో అందరికి తెలిసిన విషయమే..తాజాగా రిలీజ్ డేట్స్ విషయంలో కూడా ఇలా జరగటం మరెన్ని వివాదాలకు కారణం అవుతుందో చూడాలి…

   

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *