• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  సైనిక శిబిరంపై మరో సారి పాక్ దాడి

  pakistan-one-more-attacked-indian-army-camp

  భారత్ సర్జికల్ దాడుల తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న పాకిస్తాన్ ఎలా అయినా ఇండియాపై దాడులను చేయాలనీ త్రీవంగా ప్రయత్నిస్తుంది, సైనిక చర్యతో కాకుండా ఉగ్రవాదులను భారత్ లోకి పంపి నరమేధం సృష్టించాలని చూస్తుంది, అందుకోసం పాక్ సరిహద్దు చుట్టుపక్కల సుమారు 100 మంది దాక ఉగ్రవాదులు అదును కోసం ఎదురుచూస్తున్నట్టు,నిఘావర్గాల దగ్గర సమాచారం ఉండటంతో భారత్ బలగాలు నిఘాను ముమ్మరం చేసింది.

  అయితే ఇవాళ ఉదయం జమ్ముకశ్మీర్‌లోని హంద్వారాలో లాన్‌గేట్‌ వద్ద సరిహద్దు ఫెన్సింగ్‌ దాటి ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ.. సైనిక శిబిరంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. హోరా హోరీ పోరులో ఎట్టకేలకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాల్పుల అనంతరం ఘటనాస్థలంలో 3 ఏకే 47లు, లాంచర్లు, ఫుడ్‌ ప్యాకెట్లు, ఇంజక్షన్లు, మ్యాప్‌లు, జీపీఎస్‌ పరికరాలు, రేడియో సెట్‌లు, మ్యాట్రిక్‌ షీట్స్‌ స్వాధీనం చేసుకున్నారు.ఇంకా ఉగ్రవాదులు ఎవరైనా చొరబడ్డారా అనే అనుమానంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలని హెలికాప్టర్ సహాయంతో జల్లెడపట్టారు.

  అనంతరం అధికారులు మాట్లాడుతూ ఆ ముగ్గురి ఉగ్రవాదుల వద్ద లభ్యమైన పరికరాలు ఓబీఎస్‌ పాకిస్థాన్‌ ప్రై.లిమిటెడ్‌ సంస్థ తయారు చేసినట్లు స్పష్టమవుతోందని వాళ్ళు పాకిస్తాన్ సైనిక దుస్తులలో ప్రవేశించారు అని అక్కడ దొరిగిన ఇంజక్షన్‌లు కూడా పాకిస్థాన్‌లోనే తయారైనట్లు గుర్తించామన్నారు.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *