• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  పాక్ మీడియాలో ‘హీరో’ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి

  pakistan-media-publish-kejriwal-is-a-hero

  ఇటీవల పీఓకేలోని 7 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడి 38 మంది ఉగ్రవాదులను, వారికి రక్షణగా నిలిచిన ఇద్దరు పాక్ సైనికులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే, ఈ చర్యపై ప్రపంచ దేశాలనుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి, అలాగే మన దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ చర్యను స్వాగతించాయి.

  ఢిల్లీ ముఖ్యమంత్రి క్రేజీవాల్ ఈ క్రమంలో భారత సైనికుల సాహసాన్ని ప్రశంసిస్తూ మోదీ చూపిన చొరవను ప్రశంసించారు. వంద అంశాల్లో ఇద్దరి మధ్యా విభేదాలున్నాయనే మోదీ మెచ్చుకోలు నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసించారు,అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై జరిపినట్టు చెబుతున్న లక్షిత దాడులపై ఆధారాలను భారత్ చూపించాలంటూ అడగటంతో పాక్ మీడియా ఆనందానికి అవధులు లేకుండా పోయింది,క్రేజీవాల్ ను హీరోగా అభివర్ణిస్తూ ఈ విషయాన్ని పాక్ మీడియా పతాక శీర్షికల్లో కథనాలు ప్రచురించింది.

  భారత్ మాపై ఎలాంటి దాడులను చేయలేదు పైగా తమ సైన్యమే 8 మంది భారత్ సైనికులను మట్టుపెట్టి ఒకరిని బందీగా పట్టుకున్నాము అని బుకాయిస్తుంది, అసలు భారత్ దాడులు చేసినట్టు చెపుతున్న ప్రాంతానికి మీడియాను తీసుకోని వెళ్లి అక్కడ ఎలాంటి దాడులు జరగలేదు అని చూపించే ప్రయత్నం చేసింది, తమపై దాడులు జరగలేదు అన్న వార్తలకు క్రేజీవాల్ వ్యాఖ్యలు బలం చేకూర్చాయి అని మోడీని నిలదీసిన హీరో క్రేజీవాల్ అని పాక్ మీడియా ప్రశంసలు కురిపిస్తూ తన దూకుడును ప్రదర్శిస్తుంది. అయితే ఇలాంటి వ్యాఖ్యలు వలన పాకిస్తాన్ కి చులకన అయిపోతాము, ఇలాంటి మాటలను వెనక్కి తీసుకోవాలి అని బిజెపి నేతలు మండిపడుతున్నారు.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *