• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  సెట్స్ పైకి ఎన్టీఆర్ కొత్త సినిమా

  NTR

  జూనియర్ ఎన్టీఆర్ ఒకానొక టైమ్ లో చాలా వెనక పడిపోయిన హీరో. స్టార్ హీరోలతో పోల్చితే చివరి వరసలో ఉండేవాడు. ఎప్పుడైతే టెంపర్ సినిమాతో తన స్టైల్ ని స్టోరీ సెలక్షన్ ని మార్చుకున్నాడో అప్పటి నుండి ముందు వరుసలోకి వచ్చేశాడు మన ఎన్టీఆర్.టెంపర్ సినిమా నుండి వరుస విజయాలతో మంచి ఫామ్ ని అందుకొని దూసుకొని పోతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన “జనతా గ్యారేజ్” ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

  మరి ఇంత హిట్ కొట్టిన తరువాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేస్తాడు ఎప్పుడు తన కొత్త సినిమా మొదలు పెడతాడు అన్న ఆలోచనలు సినీ పరిశ్రమలో రోజు రోజు కి ఎక్కువ అయిపోతున్నాయి.జనతా గ్యారేజ్ లాంటి హిట్ వచ్చినా తరువాత ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యలేడు కదా అందుకే చాల కథలు విని చివరికి బాబీ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎన్టీఆర్.ముందు ఈ సినిమా కూడా ఆగిపోయింది అన్న వార్త చెక్కర్లు కొట్టింది కానీ అవి ఒట్టి గాలి వార్తలుగా మిగిలిపోయాయి.

  ఎన్టీఆర్ నటించే కొత్త సినిమాని డిసెంబర్ నెలలోనే 9వ తారీఖున కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించాలనే ఆలోచనలో వున్నారని సమాచారము. ఒకవేళ కొబ్బరి కాయ కొట్టేస్తే మాత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో వున్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్ తన కొత్త సినిమాకి చాలా కాలం తరువాత గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం తో అభిమానులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా లో పంచుకుంటున్నారు..

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *