• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఎన్టీఆర్ గూగుల్ లో టాప్ కాదు..పూర్తి ఆధారాలు ఇవిగో

  jr-ntr-50551

  నిన్నటి నుండి ఎక్కడ చూసిన కనిపిస్తున్న, వినిపిస్తున్న మాట ఏమిటంటే గూగుల్ సెర్చ్ లో మన తెలుగు స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ ‘నెంబర్ 1’ అని, ఈ సంవత్సరం గూగుల్ లో ఎక్కువగా ఎన్టీఆర్ గురించి నెటిజన్లు వెతికారని, తెలుగులో టాప్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్,రామ్ చరణ్ లాంటి హీరోల కంటే కూడా ఎన్టీఆర్ కోసం ఎక్కువగా సెర్చ్ చేశారని సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తుంది.

  అయితే ఈ వార్త కేవలం కల్పితం మాత్రమే అని మా ‘గవ్వ’ సర్వేలో తేటతెల్లమైంది. అందరూ చెపుతున్నట్లు ఎన్టీఆర్ మొదటి స్థానంలో లేడు. పైన చెప్పిన హీరోల అందరికి సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది.చివరి 12 నెలలు గూగుల్ సెర్చ్ ని పరిశీలిస్తే…

  Blue : ఎన్టీఆర్

  Red : మహేష్ బాబు

  Yellow : పవన్ కళ్యాణ్

  Green : రామ్ చరణ్

  Purple : అల్లు అర్జున్

  వరల్డ్ వైడ్ గా

  world

   

  ఇండియా వైడ్ గా

  india

   

  ఆంధ్రప్రదేశ్

  ap

  తెలంగాణ

  telagana

  పైనున్న గ్రాఫ్స్ ని పరిశీలిస్తే మనకి అర్ధం అవుతుంది ఏ హీరో మొదటి స్థానంలో వున్నాడో..ఇక్కడ మేము ఎవరు గొప్ప అనేదాని కోసం ఇవి అన్ని చెప్పటంలేదు. అభిమానులు తమకి తెలిసిన విషయాన్ని నిజమే అనుకోని గొప్పగా చెప్పుకుంటారు. వాటిలోని నిజానిజాలు తెలుసుకొని ప్రచురించవలసిన భాద్యత మీడియా మీద వుంది.

  కానీ అనేక న్యూస్ వెబ్ సైట్స్ ఎలాంటి ప్రాథమిక ఆధారాలేవీ లేకుండా కేవలం తమకి తోచిన విషయాలని, పూర్తి నిరాధారణమైన అంశాలని ఇష్టారీతిన రాయటం ఎంత వరకు సమంజసం అని అడుగుతున్నాము. ఇలాంటి న్యూస్ వలన అభిమానుల మధ్య లేనిపోని గొడవలకి మీరే కారణం అవుతున్నారు.సమాజంలో జరిగే వాటిమీద స్పదించే హక్కు మీడియాకి వుంది కానీ, సమాజ శ్రేయస్సుని కాపాడే హక్కు కూడా మీడియాదే ఈ విషయం మర్చిపోవద్దు.

  గమనిక: మేము ఏ హీరోకి సపోర్ట్ కాదు, ఏ హీరోకి వ్యతిరేకం కాదు, కేవలం నిజాన్ని బయటపెట్టటానికే ఇది రాయటం జరిగింది

   

   

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *