• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  రాయబారం పంపిన ఎన్టీఆర్

  ntr next film trivikram after pawan film

  జనతా గ్యారేజ్ సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ తన సినిమాని ఇంకా ఇంతవరకు ప్రకటించలేదు, అనేక మంది దర్శకులు కథలు వినిపించిన ఎన్టీఆర్ దేనికి పచ్చజెండా ఊపలేదు, వక్కంతం వంశీ చెప్పిన కథ ఇంకా ఎన్టీఆర్ వద్దే ఉందని సమాచారం, మరో పక్క పూరి జగన్నాధ్ ‘420’ అనే కథను ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసి ఉంచాడు, ‘ఇజం’ సినిమా రిజల్ట్స్ చూసి పూరికి అవకాశం ఇవ్వాలి అని చూస్తున్నాడు.

  తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా చేయాలనీ అనుకున్నట్టు తెలిసింది, గతంలో ఒక సారి త్రివిక్రమ్ తో మాట్లాడినట్టు సమాచారం కానీ తనకి పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంది కాబట్టి,ఎన్టీఆర్ తో సినిమా చేయలేను అని చెప్పనట్టు తెలిసింది, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఏ.ఎం.రత్నం తో సినిమా చేస్తున్నాడు కదా సో త్రివిక్రమ్ తో సినిమా చేద్దామని ‘మైత్రి మూవీస్ మేకర్స్’ వాళ్లతో  రాయబారం పంపించాడట, మైత్రి మూవీస్ లో కాకపోయినా ‘హారిక హాసిని క్రియేషన్స్’ లో చేద్దాం అని చెప్పాడట,పవన్ కి ఏ.ఎం.రత్నం మధ్య ఉన్న కమిట్మెంట్ వేరే విషయం అని పవన్ తో తన సినిమా ఉంటుంది అని త్రివిక్రమ్ ఈ రాయబారాన్ని సున్నితంగా తిరస్కరించాడు, అని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

  అయితే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం ఒక కథ సిద్ధం చేసి ఉంచాడు అని వీలైతే ఆ కథతో సినిమా తీద్దాం అని ఎన్టీఆర్ భావించి ఈ రాయబారాన్ని పంపించినట్టు అయన సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి, తన తర్వాతి సినిమ గురించి ఎన్టీఆర్ ప్రకటన చేసే వరకు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయిలే..

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *