• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  సూపర్ స్టార్ సినిమా ఆడియో వేడుకకు ఎన్టీఆర్..??

  mohanlal

  మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కి ఇప్పుడు మన తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఏర్పడిపోయింది. ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్” సినిమాలో ఒక ముఖ్య పాత్రలో చేసి సినిమాకే ప్రాణం పోశాడు మోహన్ లాల్. ఆ తరువాత తన “పులిమురుగన్” తెలుగులో “మాన్యం పులి” సినిమాతో వచ్చి ఘన విజయాన్ని అందుకున్నాడు. 

  ఇప్పుడు మోహన్ లాల్ నటించిన మరో కొత్త సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన “ఒప్పం” సినిమాని మన తెలుగు లో “కనుపాప” పేరు తో వచ్చే నెల 3న రిలీజ్ చెయ్యాలన్న ఉద్దేశ్యంలో ఉండగా ఈ సినిమా ఆడియో వేడుకను మన హైదరాబాద్ లో ఈ నెల 25వ తేదీన గ్రాండ్ గా నిర్వహించనున్నారని తెలుస్తుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించారని సమాచారం. వీళ్లిద్దరు కలిసి “జనతా గ్యారేజ్” సినిమా చేసినప్పుడు నుండి వీళ్ళ  మధ్య సాన్నిహిత్యం పెరగటం తో మోహన్ లాల్ ఈ సినిమాకి ఎన్టీఆర్ ని ఆహ్వానించడాన్ని వినికిడి.

  ఎన్టీఆర్ కూడా ఎలాగో ఇక్కడే ఉంటున్నాడు కాబట్టి “కనుపాప” సినిమా ఆడియో వేడుకకు వెళ్లనున్నాడని చెప్పుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ వేళ్తాడో లేదో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి..

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *