• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్న ఎన్టీఆర్!!!

  ntr-new-movie

  జనతా గ్యారేజ్ రిలీజ్ అయ్యిన నాలుగు నెలలకి ఎన్టీఆర్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు.ఈ సినిమాని తన సోదరుడి బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే నిర్మించబడుతుంది అన్న విషయం మనకి తెలిసిందే.డైరెక్టర్ గా బాబీ ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు.మొదటి సారి ఎన్టీఆర్ మూడు పాత్రలలో కనిపించనున్నాడు.అలాగే ఈ మూడు పాత్రలకి కూడా ముగ్గురు హీరోయిన్స్ ఎవరా అన్నది తెలిసిపోయింది.

  అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ నటించే అవకాశం ఉందని సమాచారం. ఒక్క సినిమాలో నలుగురు హీరోయిన్స్ ఏంటని కంగారు పడకండి, ఈ నాలుగో హీరోయిన్ ని ఐటమ్ సాంగ్ కోసం తీసుకోనున్నారని తెలుస్తుంది. జనతా గ్యారేజ్ లో కాజల్ అగర్వాల్ ఎలా ఐటమ్ సాంగ్ లో నటించిందో అలాగే ఈ సినిమాలో కూడా ఒక స్టార్ హీరోయిన్ ని ఐటమ్ సాంగ్ లో నటించటానికి తీసుకోనున్నారని సమాచారం.ఈ లెక్కన చూసుకుంటే ఒక్క సినిమాలో నాలుగు హీరోయిన్స్ ఉన్నట్టే కదా..

  ఈ సినిమాని ఫుల్ కమర్షియల్ హంగులతో తెరకెక్కించే ప్లాన్ లో వున్నాడంటా బాబీ. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ప్లాప్ డైరెక్టర్ గా ముద్ర వేయించుకున్న బాబీ ఈ సినిమాతో ఎలానైనా సూపర్ హిట్ కొట్టాలన్న ఉద్దేశ్యంతో ఉన్నాడంట.వచ్చే ఏడాది జనవరి లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *