• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    ఎన్టీఆర్ 27 సినిమా ఓపెనింగ్ సెలెబ్రిటీస్ వీళ్ళే

    ntr-27 movie

    ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత ఎంతో కేర్ తీసుకోని మరి సెలెక్ట్ చేసుకున్న దర్శకుడు బాబీ, ఈయన చెప్పిన కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చటంతో బాబీని ఫైనల్ చేసేసాడు, ఈ సినిమాకి వచ్చే నెల 24 న చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ కార్యక్రమం జరుపనున్నారు. దీనికి సినీ ఇండస్ట్రీ నుండి చాలా మంది అతిధులు వచ్చే అవకాశం వుంది.

    నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, అలాగే ఈ చిత్ర నిర్మాత ఎన్టీఆర్ అన్నయ్య అయినా కళ్యాణ్ రామ్ ఎలాగూ ఈ ఫంక్షన్ కి వస్తున్నాడు. వీరే కాకుండా టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ ఈ ఫంక్షన్ కి రానున్నారు. దర్శకధీరుడు రాజమౌళి, అలాగే వి.వి.వినాయక్ ముఖ్యంగా రానున్నారు, వీరికి ఎన్టీఆర్ కి మధ్యనున్న అనుబంధం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే సుకుమార్, కొరటాల శివ, పూరి జగన్నాధ్ మొదలైన వాళ్ళు పాల్గొనే అవకాశం వుంది.

    ఇప్పటికే హ్యాట్రిక్  విజయాలతో మంచి ఊపు మీద వున్నా ఎన్టీఆర్ ఈ విజయ పరంపరని కొనసాగించాలని చూస్తున్నాడు, అందుకోసమే కొంచం ఆలస్యమైనా ఒక మంచి సబ్జెక్టు తో రానున్నాడు, ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది దసరాకి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకోని రావాలని వున్నారు ఈ చిత్ర యూనిట్

     

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *