• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  భారీ విజయం దిశగా నిఖిల్ మూవీ..

  Actor Nikhil in Karthikeya Telugu Movie Stills

  నిఖిల్ హీరో గా నటించిన “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమాకి అన్ని బాగా కలిసి వస్తున్నాయ్ అనే చెప్పాలి.కరెన్సీ బ్యాన్ వల్ల పెద్ద సినిమాలతో సహా చిన్న సినిమాలు అన్ని వెనక్కి వెళ్ళిపోవటంతో కేవలం కథనే నమ్ముకొని రిలీజ్ అయిన “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమా భారీ సక్సెస్ ని అందుకుంది.ఈ వారం కూడా పెద్ద సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా లేనందున ఈ వారం కూడా ఇంకా కొంచెం కలెక్షన్స్ పెంచే పనిలో ఉంది మన చిన్నవాడి సినిమా.

  తెలుగు రాష్ట్రాలలో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో “యూఎస్” లో కూడా అంతే విజయాన్ని అందించారు అక్కడి ప్రజలు.ఏకంగా థియేటర్స్ ని ఆడ్ చేయించుకొని మరీ సినిమాని ఆస్వాదిస్తున్నారు అక్కడి సినీ ప్రేమికులు.ఈ వీకెండ్ కూడా ఈ సినిమాకి పెద్దగా పోటీ ఉండదనే చెప్పాలి.”జయమ్ము నిశ్చయమ్మురా” సినిమా తప్ప మరొక తెలుగు సినిమా విడుదలకి సిద్ధం గా లేదు కాబట్టి ఈ వారం కూడా చిన్నవాడు సేఫ్ జోన్ లోనే ఉన్నాడని చెప్పాలి అలాగే డిసెంబర్ మొదటి వారంలో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు విడుదల అవ్వటంలేదు కాబట్టి ఇంకాస్త ఊపు అందుకోనుంది “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమా.మొత్తానికి ఇంకో పది రోజులు తన జోరుని కొనసాగించనున్నాడు అన్నమాట మన చిన్నవాడు…

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *