• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మూవీ రివ్యూ: నరుడా-డోనరుడా

  naruda-donoruda- movie review

  మూవీ రివ్యూ నరుడా-డోనరుడా

  చిత్రం పేరు: ‘నరుడా-డోనరుడా’

  ప్రధాన తారాగణం:సుమంత్, పల్లవి సుభాష్,తనికెళ్ల భరణి,శ్రీ లక్ష్మి, సుమన్ శెట్టి, శేషు తదితరులు

  మ్యూజిక్: శ్రీ చరణ్ పాకల

  ఛాయాగ్రహణం:షానియెల్ డియో

  ఎడిటింగ్: కార్తీక్‌ శ్రీనివాస్‌

  నిర్మాత: సుప్రియ,సుధీర్ పూదోట.

  ప్రొడక్షన్ హౌస్: అన్నపూర్ణ స్టూడియోస్, రమా రీల్స్

  మాటలు:కిట్టూ విస్సాప్రగడ. విద్యాసాగర్‌ రాచకొండ

  కథ : జుహీ చతుర్వేది.

  స్క్రీన్ ప్లే,దర్శకత్వం: మల్లిక్  రామ్

  సరైన హిట్ కోసం దాదాపుగా 5 ఏళ్ల నుండి ఎదురుచూస్తున్న సుమంత్ ఈ సారి ఎలానైనా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో హిందీలో ఘన విజయం సాధించిన ‘విక్కీ డోనర్’ సినిమాని తెలుగులో ‘నరుడా-డోనరుడా’ స్వయంగా సుమంత్ నిర్మిస్తూ నటించాడు, తన గత సినిమాలకంటే బిన్నంగా ఈ సినిమాకి అన్ని తానై భారీ స్థాయిలో ప్రమోషన్స్ సాగించాడు, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, అఖిల్ లాంటి హీరోలతో కూడా తన సినిమాని బాగానే ప్రమోట్ చేపించి ఈ రోజే ప్రేక్షకుల ముందుకి తీసుకోని వచ్చాడు,మరి ఈ డొనరుడు… సుమంత్ కి విజయాన్ని డొనేట్   చేశాడో..లేదో…చూద్దాం..పదండి…

  మూల కథ: విక్కీ( సుమంత్) చదువు పూర్తి చేసుకొని ఎలాంటి పని పాట లేకుండా క్రికెట్ ఆడుకుంటూ ఖాళీగా తిరుగుతుంటాడు, వాళ్ళ అమ్మ (శ్రీ లక్ష్మి) నడిపే బ్యూటీ పార్లర్ మీద వచ్చే సంపాదనతో జీవితం గడిపేస్తుంటాడు, ఒక బ్యాంకులో పని చేసే అషిమా( పల్లవి సుభాష్) ని చూసి ఇష్టపడి తనని ప్రేమిస్తాడు, డా.ఆంజనేయులు (తనికెళ్ల భరణి) ఒక సంతానసాఫల్య కేంద్రాన్ని నడిపిస్తూ ఒక వీర్య దాత కోసం చూస్తుంటాడు.

  విక్కీ గురించి తెలుసుకొని తనతో వీర్యదానం గురించి చెపుతాడు, దానికి విక్కీ ఒప్పుకోడు, అయితే చివరకి తన పాకెట్ మనీ కోసం ఈ పని చేయటానికి విక్కీ ఒప్పుకుంటాడు, అయితే ఈ విషయాన్ని తన ప్రేయసి దగ్గర చెప్పకుండా దాచిపెట్టి తనని పెళ్లి చేసుకుంటాడు, ఆ తర్వాత ఈ విషయం ఆమెకి తెలుస్తుంది,.. ఆ తర్వాత విక్కీ కి అషిమాకి మధ్య జరిగిన సంఘటనులు ఏంటి…? విక్కీ చేస్తున్న పని వలన సమాజంలో అతనికి ఎదురైనా పరిస్థితులు ఎలాంటివి… చివరికి విక్కీ-అషిమా లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది మిగిలిన కథ…

  విశ్లేషణ:హిందీలో ఘన విజయం సాధించిన ‘విక్కీ డోనర్’ అనే సినిమా స్టోరీ లైన్ తోనే కాదు, అందులోని పాత్రలను కూడా అలాగే వాడాలని దర్శకుడు ప్రయత్నించాడు,ఇక్కడే మల్లిక్ రామ్ మొదటి తప్పు చేశాడు. ఒక డిఫ్ఫరెంట్ కథతో తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి  ఒక రకమైన ఎగ్జేట్మెంట్ తో థియేటర్ లోకి అడుగుపెట్టిన ప్రేక్షకుడికి సినిమా మొదటి 10 నిముషాలు ఆసక్తి కరంగా అనిపిస్తుంది, ఆ తర్వాత కొన్ని సన్నివేశాలు విసుగు పుట్టిస్తాయి, మధ్యలో సుమంత్ వీర్యదానంకి ఒప్పుకొని హాస్పటల్ కి రావటం వంటి సన్నివేశాలు ఆసక్తి కలిగించినా అది క్షణ కాలం మాత్రమే అనిపిస్తుంది, మధ్యలో తనికెళ్ల భరణి-సుమంత్ మధ్య నడిచే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో బాగానే నవ్వుకోవచ్చు ఇంటర్వల్ కి ముందు హీరోయిన్ హీరో లవ్ ని ఓకే చేయటం సుమంత్ నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకోవటం జరుగుతుంది, ఆ తర్వాత ఎలాంటి విషయాలు జరుగుతాయనే ఉత్కంఠ ప్రేక్షకులకి కలుగుతుంది.

  అయితే దానిని డీల్ చేయటంలో దర్శకుడు విఫలమైయ్యాడనే చెప్పాలి,ఒక దశలో హీరోయిన్-హీరోని వదిలి పెట్టేస్తుంది, అయితే దానికి గల కారణాలను తెర మీద సరైన రీతిలో చూపించలేదు, ఏదో వదిలి పెట్టాలి అన్నట్లు వదిలేయటం, అలాగే హీరోని పోలీస్ లు జైలు కి తీసుకోని వెళ్ళటం వెంటనే వదిలేయటం లాంటి సన్నివేశాలు కూడా ఏదో తమాషాగా అనిపిస్తాయి, ఒక సమయంలో సెకండ్ ఆఫ్ కంటే మొదటి భాగంలోని కామెడీ బెస్ట్ అనే ఫీలింగ్ కలుగుతుంది.

  అయితే సినిమా ముగింపు సన్నివేశాలు మాత్రం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవుతాయి అనటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు, చివరిలో చిన్న పిల్లని దత్తత తీసుకొనే సన్నివేశాలు ప్రేక్షకుల మదిని తాకుతాయనే చెప్పాలి, అంత బాగా క్లైమాక్స్ ని చిత్రీకరించారు, అలాగే చివరిలో నాగ చైతన్య ఎంట్రీ ఇవ్వటం కొసమెరుపు.. దర్శకుడు వీర్యదానం, చివరి క్లైమాక్స్ ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని సినిమాని తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాకి కామెడీనే ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు.

  నటి నటులు: ఈ సినిమాలో సుమంత్ తన గత సినిమాలకంటే భిన్నంగా నటించాడు, కామెడీ విషయంలో కానీ తన బాడీ లాంగ్వేజ్ విషయంలో కానీ చాలా వైవిధ్యం చూపించాడు, అలాగే ఎమోషనల్ సన్నివేశంలో అతడి నటన ఆకట్టుకుంటుంది,తెలుగులో ఇలాంటి సినిమాల్లో నటించటమే కాకుండా తానే స్వయంగా నిర్మించటం పెద్ద సాహసమే అని చెప్పాలి, ఇందులో డాక్టర్ గా చేసిన తనికెళ్ల భరణి సినిమా మొత్తనికి మూల స్తంభంగా నిలబడి తన పాత్రని అద్భుతంగా పోషించాడు, హీరోయిన్ గా పల్లవి నటన పర్వాలేదు, ఈ సినిమాలోని పాత్రకి బాగానే న్యాయం చేసిందని చెప్పవచ్చు, చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తెర మీద కనిపించిన అలనాటి హాస్యనటి శ్రీ లక్ష్మి తన నటనతో మెప్పించి తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకుంది, తనికెళ్ల భరణి అసిస్టెంట్ గా సుమన్ శెట్టి బాగానే నటించాడు..

  సాంకేతిక వర్గం: మనం పైన చెప్పుకున్న విధంగా దర్శకుడు మల్లిక్ రామ్ వీర్యదానం, క్లైమాక్స్ సీన్స్ వంటి వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మిగిలిన కథని నడిపించాడని అర్ధం అవుతుంది, కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలని తెరకెక్కించడంలో అతని అనుభవరాహిత్యం కనిపిస్తుంది, అయితే క్లైమాక్స్ ని చిత్రీకరించిన విధానం తప్పకుండా ఆకట్టుకుంటుంది, శ్రీ చరణ్ అందించిన సంగీతం అంతగా గొప్పగా ఏమి అనిపించదు, ఇందులో రిజిస్టర్ అయ్యే పాటలు ఏమి లేవు, షానియెల్ డియో సినిమాటోగ్రఫి చాలా బాగుంది, అతి తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ ఫుట్ అందించాడు, మిగిలిన సాంకేతిక వర్గం సో..సో…

  చివరి మాట: ఇలాంటి సినిమాని తెలుగులో నిర్మించటం గొప్ప సాహసమే..చూద్దాం మరి ఈ సినిమాని తెలుగు జనాలు ఎలా ఆదరిస్తారో…

  గవ్వ కామెంట్: బోల్డ్ గా నవ్వించి…లైట్ గా బాధపెట్టే ‘నరుడు’

  గవ్వ రేటింగ్: 2.5/5

  ‘గ’మనిక: ఇది కేవలం మా అభిప్రాయం మాత్రమే..

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *