• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  నారా రోహిత్ సినిమాకి రిలీజ్ డేట్ వచ్చేసింది…

  nararohit

  సినిమా యొక్క జయాపరాజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు నారా రోహిత్. బాణం సినిమాతో మన తెలుగు పరిశ్రమకి పరిచయం అయ్యిన నారా రోహిత్ వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ మంచి నటుడిగా పేరు సంపాదించాడు.ఇప్పటికే ఈ ఏడాది లో ఐదు సినిమాలని విడుదల చేసిన నారా రోహిత్ ఇదే ఏడాది చివరిలో తన కొత్త సినిమాని విడుదల చెయ్యటానికి సిద్ధం అయిపోతున్నాడు.

  నారా రోహిత్ నటించిన ‘అప్పట్లో ఒక్కడుండేవాడు’ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసారు.ఈ సినిమాని ఈ నెల చివరి వారంలో 30వ తారీఖున మన ముందుకు తీసుకురావటానికి సిద్ధం అయిపోతున్నారు ఈ చిత్ర యూనిట్ వాళ్ళు.ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చెయ్యగా చాలా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.అందులోనూ ఈ కథ మొత్తం మన హైదరాబాద్ కి చెందిన కథ కావటంతో ఈ సినిమా మీద చాలా అంచనాలే ఉన్నాయి.

  ఈ సినిమాలో శ్రీ విష్ణు ఒక ముఖ్యమైన పాత్ర లో కనిపించనున్నాడు.నారా రోహిత్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. తాన్యా హోప్ నారా రోహిత్ సరసన హీరోయిన్ గా నటించింది.సాగర్ కె చంద్ర ఈ సినిమాని తెరకెక్కించగా ప్రశాంతి,కృష్ణ విజయ్ ఈ సినిమాని నిర్మించారు.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *