• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  నేను పక్క లోకల్ అంటున్న నాని

  Nani Nenu local first look

  ఈ సంవత్సరంలో ఇప్పటికే 3  సినిమాలు విడుదల చేసి ఘన విజయాలు అందుకున్న నేచురల్ స్టార్ నాని మరోసారి ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతున్నాడు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘నేను లోకల్’. ఇందులో నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

  ‘పేరు: బాబు చదువు: నిల్, ఆటిట్యూడ్: ఫుల్ నేను ఇక్కడే పుట్టాను .. ఇక్కడే పెరిగానంటూ’ ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి స్వయంగా నాని చెపుతూ ‘నేను లోకల్’ ఫస్ట్ లుక్ ను పోస్ట్ చేశాడు, ఇందులో నాని మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు, సినిమా పేరులోనే మాస్ ఫిలింగ్ కలుగుతుంది, అలాగే హీరో లుక్ కూడా ఊరమాస్ లో ఉంది, వీటన్నిటికీ తోడు మాస్ సినిమాలని తన మ్యూజిక్ తో మరో మెట్టు ఎక్కించే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించటంతో ఈ సినిమా పై మాస్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

  గతంలో ‘సినిమా చూపిస్తమామ’ అనే సినిమాకి దర్శకత్వం వహించిన నక్కిన త్రినాథరావు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ లో విడుదల చేయాలనీ చిత్ర బృందం భావిస్తుంది.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *