• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  నాగ్ కోసం లాబీ లో ఏమి జరుగుతుందో తెలుసా..?

  nagarjuna-latest-photos

  మల్టీ స్టార్స్ సినిమాలకి ఉన్న క్రేజ్ వేరు, ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తుంటే అటు అభిమానులకి ఇటు సాధారణ జనాలకి చూడటానికి రెండు కళ్ళుసరిపోవు, గతంలో తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళు అయిన ఎన్టీఆర్- ఏఎన్ఆర్ కలిసి అనేక సినిమాలో నటించి అప్పట్లోనే మల్టీ స్టార్స్ సినిమా అంటే ఏమిటో చూపించారు, ఆ తర్వాత కొన్ని ఏళ్ల పాటు అలాంటి సినిమాలు ఎక్కువగా రాలేదు, ఒక రకంగా మళ్ళీ విక్టరీ వెంకటేష్ మల్టీ స్టార్స్ చిత్రాలని పరిచయం చేసాడనే చెప్పాలి, మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, రామ్ లాంటి వాళ్లతో కలిసి నటించాడు, హీరో నాగార్జున కూడా అపుడప్పుడు కొన్ని మల్టీ స్టార్స్ సినిమాలో నటించాడు,  రీసెంట్ గా నాగార్జున కూడా ఊపిరి సినిమాతో కార్తీ తో నటించాడు.

  తాజాగా కింగ్ నాగార్జున మరో మల్టీ స్టార్స్ చిత్రంలో నటించే అవకాశం కనిపిస్తుంది, మలయాళంలో ఘన విజయం సాధించిన ఒక హర్రర్ సినిమాని తెలుగులో ‘రాజు గారి గది 2’ గా ఓంకార్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కపోతుంది, ఇందులో నాగార్జున ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం దాదాపుగా  కన్ఫర్మ్ అయింది,ఇప్పటికే నాగ్ తనకు ఈ సినిమా స్టోరీ బాగా నచ్చేసిందని నిద్ర కూడా పట్టకుండా చేస్తుందని చెప్పటం జరిగిందిలే, ఈ సినిమాలో నాగార్జునతో పాటు మూడు ప్రధాన పాత్రలు కూడా ఉంటాయని తెలుస్తుంది,

  వాటి కోసం ముగ్గురు యువ హీరోలని తీసుకునే అవకాశం ఉంది. ‘రాజు గారి గది 2’ అనే టైటిల్ అంటున్నారు కాబట్టి రాజుగారి గది లో ప్రధాన పాత్ర పోషించిన ఓంకార్ తమ్ముడు అశ్విన్ ను ఒక పాత్రకి తీసుకుంటారు, ఎలాగూ డైరెక్టర్ ఓంకార్ కాబట్టి తన తమ్ముడి కోసం ఆల్రెడీ రిజర్వ్ చేసేశాడు, ఇక మిగిలిన రెండు పాత్రలు కోసం యంగ్ స్టార్స్ నాగ శౌర్య, రాజ్ తరుణ్ ని తీసుకోవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

  అయితే ఇందులో మూడు పాత్రలు ఉన్నాయని వాటి కోసం యంగ్ హీరోలు కావాలని తెలియటంతో ఇప్పుడున్న కొంతమంది యంగ్ హీరో లు ఈ సినిమాలో నటించటం కోసం తెర వెనుక బాగానే ‘లాబీ’లు చేస్తున్నారని ఫిలింనగర్ టాక్. ఎలాగూ నాగార్జున అంత నమ్మకంతో ఈ సినిమా గురించి చెపుతున్నాడు, ఆయనే స్వయంగా నటిస్తున్నాడు, సో ఈ సినిమాలో ఆయనతో స్క్రీన్ పంచుకుంటే అది తమ కెరీర్ కి చాలా ప్లస్ అవుతుందని కుర్ర హీరోలు భావిస్తున్నారు.  చూద్దాం మరి నాగార్జునతో నటించే కుర్ర హీరోలు ఎవరో…

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *