• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  “ఖైదీ నెం150″కి ముఖ్య అతిధులుగా వాళ్ళిద్దరు

  Venkatesh And nagarjuna And Chiranjeevi

  మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న “ఖైదీ నెం150″సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే.చిరంజీవికి ఇదొక మైల్ స్టోన్ చిత్రం కావటంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రతి వేడుకను చాలా ఆడంబరంగా చెయ్యాలన్న నిర్ణయంలో చిత్ర యూనిట్ ఉందని ఇంతక ముందే తెలిపారు.

  “ఖైదీ నెం 150 ” కి సంబంధించిన ఒక వేడుక వచ్చే నెలలో జరగటానికి సిద్ధంగా ఉంది అదే ఈ సినిమా యొక్క ఆడియో విడుదల.డిసెంబర్ రెండో వారంలో ఈ వేడుకని జరపాలన్న ఆలోచనలో ఉన్నారని సమాచారం.ఈ వేడుకకి సినీ ప్రముఖులు చాలా మంది రానున్నారని అలాగే చిరు తో పని చేసిన దర్శక నిర్మాతలు అందరూ వచ్చేలాగా ఈ వేడుకని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.కాగా ఈ సినిమాకి ముఖ్య అతిధులుగా అక్కినేని నాగార్జున అలాగే దగ్గుబాటి వెంకటేష్ ని ఆహ్వానిస్తున్నారని వినికిడి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి అని కూడా మీడియా లో ఈ వార్త చెక్కర్లు కొడుతుంది.అయితే ఈ వేడుకకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంక ఏమి చెయ్యలేదు.

  “ఖైదీ నెం 150 ” సినిమాలో కోర్ట్ సీన్ ఒకటి షూట్ చేసేస్తే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తికానుంది అంట.దానితో పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీద దృష్టి పెట్టనున్నారు అంట ఈ చిత్ర యూనిట్.ఈ సినిమాని వి.వి వినాయక్ తెరకెక్కించగా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించాడు. వచ్చే ఏడాది జనవరికి సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయనున్నారు ….

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *