• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మేము కలిసే ఉంటాం.. ములాయం..

  mulayam-singh-yadav-denies-that-theres-no-rift-in-the-party

  సమాజ్ వాది పార్టీలో చీలికలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. బాబాయ్ అబ్బాయి గొడవల్లో ప్రభుత్వం పడిపోతుందని ప్రచారం జరుగుతున్న వేళ, ములాయం సింగ్ తన తమ్ముడు శివపాల్ యాదవ్ తో కలిసి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. తమ కుటుంభం మరియు పార్టీలో గొడవలు లేవని, అందరం కలిసి పోయామని తెలిపారు.

  ప్రస్తుతానికి అఖిలేష్ సీఎంగా కొనసాగుతారు, వచ్చే యూపీ ఎన్నికల్లో మెజారిటీ వచ్చాక సీఎం ఎవరనేది నిర్ణయిస్తాం అని చెప్పారు. ఈ సందర్బంగా మీడియా, ములాయంను మీరే సీఎం గా ఉండచ్చు కదా అని అడగగా, రెండు నెలలకు సీఎంగా ఉండి చేసేదేముంది, అఖిలేష్ ఆ భాద్యత చూసుకుంటాడు అని తెలిపారు. కాబినెట్ మినిస్టర్స్ ని పార్టీలోకి తీసుకునే నిర్ణయం అఖిలేష్ కే వదిలేస్తున్నా అన్నారు. బాబాయ్ శివపాల్ ని కూడా కాబినెట్ లోకి తీసుకునే నిర్ణయం అఖిలేష్ కే అప్పచెప్పారు.

  2012 లో తన వైపున మెజారిటీ ఉండిందని, అందుకే అఖిలేష్ ని సీఎంని చేశామని, ఇప్పుడు అఖిలేష్ ఆ భాద్యతలు, దాని వల్లే వచ్చే పరిణామాలు సమర్ధవంతంగా తానే ఎదుర్కోవాలన్నారు ములాయం. ప్రతి చిన్న విషయానికి అమర్ సింగ్ ని లాగొద్దని హితవు చెప్పారు. అమర్ సింగ్ తనకు తమ్ముడులాంటి వాడని, పార్టీ ఎదగడానికి మంచి సలహాలు ఇచ్చాడని వెనకేసుకొచ్చారు ములాయం. ఇది ఇలా ఉండగా సీఎం అఖిలేష్ యాదవ్ ఈ ప్రెస్ మీట్ కి రాకపోవడం గమనార్హం..

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *