• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    జనతా గ్యారేజ్ నష్టాలను భర్తీచేస్తున్న పులి

    janatha-garage

    ఎన్టీఆర్-మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ బాగానే రికార్డ్స్ రిపేర్ చేసింది.ఎన్టీఆర్ కెరీర్ అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి మూడు చిత్రాల్లో స్థానం సంపాదించింది.మరి అలాంటి సినిమాకి నష్టాలేంటి అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాము.

    ఇందులో నటించిన మోహన్ లాల్ కి రెమ్యూనరేషన్ బదులుగా కేరళ కి సంబంధించిన సినిమా హక్కులని ఇచ్చారు. అయితే ఈ సినిమా అక్కడ అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. దీనికి కారణం అక్కడ మోహన్ లాల్ ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవటం వలనే ఆశించిన స్థాయిలో కలెక్షన్ రాలేదు. దీని వలన మోహన్ లాల్ కొంచం నష్ట పోయాడు.

    అయితే తాజాగా మోహన్ లాల్ నటించిన ‘పులిమురుగన్’ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచి 100 కోట్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డ్స్ నెలకొల్పింది. అదే సినిమాని తెలుగులో ‘మన్యం పులి’  పేరుతో విడుదల చేశారు, దాదాపుగా 350 థియేటర్స్ విడుదల చేశారు, ఇక్కడ కూడా ఈ సినిమాకి మంచి పేరు రావటంతో జనతా గ్యారేజ్ వలన కేరళలో వచ్చిన వసూళ్ల గ్యాప్ ని మన్యం పులితో మోహన్ లాల్ తెలుగులో రాబట్టుకుంటున్నాడు. ఎంతైనా కంప్లీట్ యాక్టర్ కదా అన్ని సమపాళ్లలో ఉండేలా చూసుకుంటాడులే..

     

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *