• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  వర్చవల్ రియాల్టీ అంటున్న సూపర్ స్టార్

  mahesh-babu

  వర్చవల్ రియాల్టీ మనకు పెద్దగా పరిచయం లేని పేరు, కానీ బాహుబలి సినిమాతో ఈ టెక్నాలజీని మనకు పరిచయం చేశారు, వర్చవల్ రియాల్టీ లో చేసిన వీడియోను బాహుబలి టీమ్ విడుదల చేసింది, దానికి విపరీతమైన స్పందన వస్తుంది, ఆ వీడియో చూసి అగ్రశ్రేణి సినిమాటోగ్రాఫర్ పి.సి శ్రీరామ్ స్వయంగా మెచ్చుకున్నారు అంతే వర్చవల్ రియాల్టీ వీడియో అనుభూతి ఎలాంటిదో అర్ధం అవుతుంది,ఇప్పుడు మహేష్ బాబు కూడా తన సినిమా టీజర్ ని వర్చవల్ రియాల్టీ లో తీసుకురావటనికి ప్రయత్నాలు చేస్తున్నారు.

  మురగదాస్-మహేష్ బాబు కాంబినేషన్స్ లో తెరక్కేకుతున్న సినిమాకి సంబంధించి టైటిల్ ను దీపావళి సంధర్బంగా ప్రకటించే అవకాశం ఉంది, అదే రోజు సినిమా టీజర్ ని కూడా విడుదల చేయనున్నారు అని తెలుస్తుంది, అయితే ఈ టీజర్ ని వర్చవల్ రియాల్టీ టెక్నాలజీలో డెవలప్ చేసి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారని, దానికి సంబంధించిన పనులను న్యూయార్క్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థకి అప్పగించినట్టు తెలుస్తుంది.10 సెకెన్ల  ఈ వీడియో కోసం కొన్ని లక్షల్లో ఖర్చుపెడుతున్నారు.

  రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, లియో ప్రొడక్షన్స్, మహేష్ బాబు సొంత ప్రొడక్షన్స్ హౌస్ ఎం.బి ఎంటర్టైన్మెంట్, మరియు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ కలిసి మహేష్ బాబు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కధానాయికగా నటిస్తుంది, వచ్చే సంవత్సరం వేసవి నాటికీ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *