• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    సినిమాగా కేసీఆర్ జీవిత చరిత్ర

    kcr-and-madhura-sridhar

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి,ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్నారు, ఈ విషయాన్ని మధుర శ్రీధర్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ నోట్ ద్వారా వెల్లడించారు.

    ప్రెస్ నోట్:

    సినిమాగా కేసీఆర్ జీవిత చరిత్ర
    కొందరు ఆయన్ని స్వరాష్ట్ర స్వాప్నికుడన్నారు. కొందరు తెలుగువారి మధ్యలో చిచ్చుపెట్టిన ప్రాంతీయవాది అన్నారు. కొందరు ఆయన్ని ప్రజాస్వామిక వ్యవస్థలో నియంత అన్నారు. కొందరు నియంతృత్వ ధోరణులున్న ప్రజాస్వామ్య రక్షకుడన్నారు. కొందరు ఆయాన్ని పోరాటశక్తి అన్నారు. కొందరు కేవలం ఆరాటపరుడు అన్నారు. కొందరు ఆయన్ని రాజనీతి విద్వాంసుడన్నారు. కాని 4 కోట్ల తెలంగాణా ప్రజలకు ఆయన ఒక ఆశయ సారధి… వారి కలలను నిజం చేసిన మహా నాయకుడు. ఎవరు ఏమన్నా, ఎవరు ఎలా అనుకున్నా, ఉద్యమంలో ఆయన ముందుకు సాగారు. ఇదంతా మనమందరం చూసిన చరిత్ర, చూస్తున్న వర్తమానం.

    కేసీయార్ అనే మూడక్షరాలు తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడైతే చిరునామాగా మారాయో, దేశం మొత్తం ఉద్యమాన్ని ఒక సానుకూల ధొరణిలో చూడటం మొదలు పెట్టింది… 1969 తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న మా నాన్న చెప్పే సంగతులు వింటూ పెరిగిన నేను, విన్న ఆనాటి సంగతులు, చూసిన ఈనాటి సంఘటనలు నాలో ఉన్న దర్శకుడిని కొన్నాళ్లుగా నిద్రపోనీయలేదు. ఆ క్రమంలో కొన్ని పరిశోధనలు చేసాను. తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమకారుల్ని విడివిడిగా కలిసాను. కొందరి మాటల ద్వారా ఎన్టీయార్, చంద్రబాబు నాయుడు, వై. ఎస్. ఆర్, సోనియా గాంధి, చిరంజీవి, లగడపాటి రాజ్ గోపాల్, వెంకయ్యనాయుడు, అద్వాని ఇంకా పవన్ కళ్యాణ్ తెలంగాణా ఉద్యమాన్ని అర్థం చేసుకున్న తీరు తెలుసుకున్నాను. మహాత్మా గాంధి, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలకు ఏమాత్రం తీసిపోని అత్యంత సంక్లిష్టమైన, భయంకరమైన సవాళ్లు కేసీయార్ ఎలా ఎదుర్కున్నారనే విషయాలు తెలుసుకున్నాక ఇక ఈ చరిత్రని తెరపైకి ఎక్కించాల్సిందేనని ఒక దర్శకుడిగా నిర్ణయం తీసుకున్నాను.

    2017 జూన్ 2న తెలంగాణా ఆవిర్భావదినోత్సవాన షూటింగ్ మొదలుపెట్టి, 2018 ఫిబ్రవరి 17న కేసీయార్ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేయబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తన ధర్మపధ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. – మధుర శ్రీధర్ రెడ్డి.

    ప్రస్తుతం మధుర శ్రీధర్ గారు సుమంత్ అశ్విన్ హీరోగా వంశీ డైరెక్టర్ గా ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ అనే సినిమాను తెరక్కేకించే పనిలో ఉన్నారు, గతంలో వచ్చిన లేడీస్ టైలర్ కి సీక్వెల్ గా నిర్మిస్తున్నారు, ఈ సినిమా తర్వాత కెసిఆర్ జీవిత చరిత్ర తెరక్కేకించే అవకాశం ఉంది.

     

     

     

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *