• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  పారితోషకం 80 శాతం బ్లాక్ మనీ

  madhura-sridhar

  మోడీ తీసుకున్న అనూహ్య నిర్ణయానికి అనేక మంది సినీ ప్రముఖులు మద్దుతు ఇస్తున్న, కొంత మంది  మాత్రం లోలోపల తీవ్ర అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు, సినిమా చిత్రీకరణలో భాగంగా రోజు వారి ఇచ్చే జీతాలకి డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇది ఇలా ఉంటే మరో పక్క నటి నటులు పారితోషికాలు తగ్గుతాయి అనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి, అవి కేవలం ఊహాగానాలే తప్ప వాటిలో నిజం లేదని ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ తెలిపాడు.

  ‘ఇప్పటి వరకు మోడీ తీసుకున్న నిర్ణయం అందరికి షాకింగ్ గా అనిపించినా రాబోయే రోజులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు, అందరూ న్యాయ బద్దంగా సంపాదించాలి, ఎట్టి పరిస్థితిలోను పన్నులు ఎగ్గొట్టటానికి వీలులేదని విషయాన్ని అందరూ బలంగా నమ్మితీరాలి, ఇలాంటి స్థితిలో సినీ పరిశ్రమలో పారితోషికాలు తగ్గుతాయి అని అనుకోవటం లేదు, ఎప్పటిలాగే అవి కొనసాగుతాయి.తాజాగా నా సినిమాలో ఒక నటుడు 80 శాతం దాక పారితోషికం బ్లాక్ మనీ రూపంలోనే ఇవ్వమని కోరాడు, కానీ ఇక మీదట అలాంటి అవకాశం లేదు, ఇది ఒక రకంగా చాలా మంచిది, సినిమా ఖర్చులు అన్ని పేపర్ మీద పక్క లెక్కలతో ఉంటాయి, నేను నిర్మాతగా వ్యవరిస్తున్న ‘ఫ్యాషన్ డిజైనర్’ షూటింగ్ గురువారం నుండి ప్రారంభం అవుతుంది, రోజు వారి వేతనాలు ఎలా ఇవ్వాలో అర్ధం కావటంలేదు కానీ ఈ సమస్య రెండు రోజులు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత అంత సర్దుకుంటుంద’ని చెప్పాకొచ్చాడు.

  షూటింగ్ జరుపుకుంటున్న ఎన్నో సినిమాలకి ఈ కష్టాలు తప్పటంలేదు, కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలకి కల్లెక్షన్స్ తగ్గే అవకాశం వుంది, అయినా ఎప్పటి నుండో సినీ పరిశ్రమలోకి నల్ల బజారు నుండి డబ్బులు సంచులు రూపంలో వచ్చి ఇక్కడ వైట్ మనీ అవుతున్నాయనే వాదనలు వున్నాయి,కేవలం అవి వాదనలు మాత్రమే అని సరిపెట్టలేము… మోడీ నిర్ణయం వలన సినీ పరిశ్రమలోకి తాత్కాలికంగా ‘నల్ల బజారు సరుకు’కి  అడ్డుకట్ట వేసినట్టే..

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *