• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  జగపతి బాబుకి పెగ్గు తాగించి అలా చేశాను…

  krishna-vamsi

  సాధారణంగా సినిమా పూర్తి అయినా తర్వాత పార్టీలు చేసుకోవటం ఇండస్ట్రీలో సర్వసాధారణ విషయం, అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో షూటింగ్ టైములో నటీనటులు మందు కొట్టి కెమెరా ముందు నటించిన సంఘటనలు లేకపోలేదు, అలాంటి సంఘటన తన షూటింగ్ లో జరిగిందంటూ  ఆనాటి విషయాలను ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.

  కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ‘అంతఃపురం’ సినిమా అప్పట్లో ఎంత ఘన విజయం సాదించిందో, అందులో దుబాయ్ పాండియన్ గా ‘జగపతి బాబు’ నటన కి అంతటి ప్రశంసలు లభించాయి, ఈ సినిమాలో జగపతి బాబు మీద సీన్స్ అన్ని ఐదు రోజుల్లో చిత్రీకరించారు, ఆ సమయంలో షూట్ కి మధ్యలో జగపతి బాబుతో ఒక పెగ్గు టకీలా తాగించి మరి కృష్ణ వంశీ షూట్ చేసేవాడట, ఇలా షూట్ సమయంలో డ్రింక్ చేయటం వలన కొన్ని సన్నివేశాలు మనం అనుకున్న దాని కంటే ఇంకా బాగావస్తాయని ఉద్దేశ్యంతో ఆలా చేసేవారు, అయినా కృష్ణ వంశీ సినిమాలో అలాంటి పాత్ర చేయాలంటే ఆ మాత్రం పెగ్గు పడాలసిందే.

  ప్రస్తుతం కృష్ణ వంశీ నక్షత్రం అనే సినిమా తెరకెక్కిస్తున్నారు, ఇందులో సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు, ఈ సినిమా తర్వాత బాలకృష్ణ హీరోగా ‘రైతు’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు,ఇందులో ఒక ముఖ్య పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ని సంప్రదించటం జరిగింది.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *